ETV Bharat / jagte-raho

ఆయిల్ ట్యాంకర్​లో తరలిస్తున్న 900 కిలోల గంజాయి పట్టివేత - శృంగవరపు కోట వార్తలు

అయిల్ ట్యాంకర్​లో తరలిస్తున్న 900 కిలోల గంజాయిని ఏపీలోని శృంగవరపుకోట పోలీసులు పట్టుకున్నారు. బిహార్​కు చెందిన లారీ డ్రైవర్​ను రిమాండ్​కు తరలించినట్లు ఇన్​ఛార్జ్ సీఐ గోవిందరావు చెప్పారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.

ఆయిల్ ట్యాంకర్​లో తరలిస్తున్న 900 కిలోల గంజాయి పట్టివేత

author img

By

Published : Jan 8, 2021, 4:49 PM IST

ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆయిల్ ట్యాంకర్​లో తరలిస్తున్న 900 కిలోల గంజాయిని శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇన్​ఛార్జి సీఐ గోవిందరావు వెల్లడించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అరకు వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్​ను ఆపి తనిఖీ చేయగా అందులో 30 బస్తాల్లో 900 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు.

బిహార్​కు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి తన సొంత లారీలో గంజాయి తరలించడానికి డ్రైవర్​ను సహాయకుడిగా పంపారన్నారు. ట్యాంకర్ డ్రైవర్​ను రిమాండ్ తరలించామని ... ప్రధాన నిందితుడైన ప్రకాష్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు.. దీని వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుకున్న గంజాయి విలువ 30 లక్షల వరకు ఉంటుందని రాష్ట్రం దాటితే దీని విలువ కోటి రూపాయలకు పెరుగుతుందన్నారు.

ఇదీ చదవండి: కారులో చెలరేగిన మంటలు... తప్పిన ప్రాణనష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.