జిల్లాలో ఎవరైనా అక్రమ వ్యాపారాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన బెల్లం, నిందితుల అరెస్ట్ వివరాలను మరిపెడ పీఎస్లో వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి మరిపెడలో వివిధ గ్రామాలకు బెల్లం రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు.
219 బస్తాల్లో 102 క్వింటాళ్ల నల్లబెల్లం, 15 బస్తాల్లో 7.5 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన బెల్లం విలువ రూ. 9.36 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా బెల్లం రవాణాకు ఉపయోగించిన డీసీఎం, ట్రాక్టర్, ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బెల్లం రవాణాకు పాల్పడుతున్న వారిలో 8 మందిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో గార్డెన్లు ఏర్పాటవ్వాలి : కేసీఆర్