ETV Bharat / jagte-raho

తండాలో 500 కోళ్లు మృతి.. ఏం జరిగి ఉంటుందో? - తెలంగాణ వార్తలు

డిచ్​పల్లిలోని ఓ కోళ్ల ఫామ్​లో 500 కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మృతి చెందిన కోళ్లను పరిశీలించిన జిల్లా పశు సంపర్ధక శాఖ అధికారులు... బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.

500-hens-died-at-poultry-farm-dichpally-in-nizamabad-district
500 కోళ్లు మృత్యువాత... కారణమేంటి?
author img

By

Published : Jan 13, 2021, 7:19 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం యానంపల్లి తండాలోని రామ్ చంద్ర గౌడ్ కోళ్ల ఫామ్​లో 500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. మూడు రోజులుగా కోళ్లు వరుసగా మృతి చెందడంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు ఫామ్​ను సందర్శించారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణం కాదని జిల్లా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ తెలిపారు.

బర్డ్ ఫ్లూ ప్రాథమిక లక్షణాలు లేకున్నా కోళ్ల రక్త నమూనాలు సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ రాలేదని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బర్డ్ ఫ్లూని ఎదుర్కొనేందుకు పశువర్ధక శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మృతిచెందిన కోళ్లకు అమ్మవారు వచ్చి ఉండొచ్చని ఆయన ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇదీ చదవండి: గోదా రంగనాథ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.