ETV Bharat / jagte-raho

బాలిక నుంచి 40 తులాల బంగారం, వెండి అపహరణ - gold chory at rangareddy

ఓ బాలిక నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలను తీసుకొని ఓ వ్యక్తి ఊడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

crime news
బాలిక నుంచి 40 తులాల బంగారం, వెండి అపహరణ
author img

By

Published : Dec 7, 2020, 7:57 AM IST

మహిళల దృష్టి మరల్చి 40 తులాల బంగారం, వెండి పట్టగొలుసులు కాజేశాడు ఓ ఆగంతకుడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ఈ ఘటన జరిగింది.

మగ్గురు మహిళలు.. తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను బాలికకు ఇచ్చి ఓ గుర్తుతెలియని వ్యక్తితో పంపించారు. కొంత దూరం ఆ బాలికను తీసుకెళ్లిన వ్యక్తి.. అప్జల్​ గంజ్​ ప్రాంతంలో ఆభరణాలను తీసుకొని ఊడాయించాడు. బాలిక ఏడుస్తుండడాన్ని గమనించిన స్థానికులు కారణాలపై ఆరా తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బాలికను శంషాబాద్​ ఠాణాకు తీసుకెళ్లి సమాచారం సేకరించారు. అనంతరం తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు. బాధితుల ఫిర్యాదుతో కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి: చోరీలకు పాల్పడుతున్న అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.