ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై నుంచి రోడ్డుపై పడిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు.... సి.బెళగాల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బాలకృష్ణ, గజ్జలమ్మ, జానమ్మగా గుర్తించారు.
ఇదీ చూడండి: ఘోరప్రమాదం.. ఏడుగురు దుర్మరణం