ETV Bharat / jagte-raho

జీన్స్​ ప్యాంటులో బంగారు బిస్కెట్లు... దొరికిపోయిన ప్రయాణికుడు

author img

By

Published : Nov 11, 2020, 6:36 PM IST

విదేశాల నుంచి వినూత్న రీతుల్లో బంగారాన్ని దేశానికి తరలిస్తూ... అధికారులకు దొరికిపోతున్నారు. శంషాబాద్​ విమానాశ్రయంలో ఓ యువకుడు... ప్యాంటుకు ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకుని మరీ బంగారాన్ని దాచుకున్నాడు. కానీ... కస్టమ్స్​ అధికారుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.

జీన్స్​ ప్యాంటులో బంగారు బిస్కెట్లు... దొరికిపోయిన ప్రయాణికుడు
జీన్స్​ ప్యాంటులో బంగారు బిస్కెట్లు... దొరికిపోయిన ప్రయాణికుడు

హైదరాబాద్​ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 20 తులాల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 233 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ ఉప కమిషనర్‌ శివకృష్ణ తెలిపారు.

ప్రయాణికుడు జీన్స్‌ ప్యాంట్‌లో నడుము వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్‌లో ఈ బిస్కెట్లను దాచుకుని వచ్చినట్లు అధికారులు వివరించారు. 233 గ్రాములు బరువైన రెండు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని... వాటి విలువ రూ.12లక్షల 22 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఇదీ చూడండి: క్రికెట్ బెట్టింగ్​లో నష్టం.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.