ETV Bharat / jagte-raho

ఈజీమనీ కోసం అడ్డదారులు.. వందకిలోల గంజాయితో ఐదుగురి అరెస్ట్ - హైదరాబాద్ లో వంద కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్​లో గంజాయి దందా జోరుగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తూ.. ఇక్కడ అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పోలీసులు నగరంలో 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ లో వంద కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ లో వంద కిలోల గంజాయి స్వాధీనం
author img

By

Published : Aug 18, 2020, 8:21 AM IST

హైదరాబాద్ లో 100 కిలోల గంజాయిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టప్పాఛబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లగడ్డ బస్టాప్ వద్ద నలుగురు యువకుల వద్ద 70 కిలోల గంజాయి ఉందనే కచ్చితమైన సమాచారంతో పోలీసులు వారిపై దాడి చేసి సరుకు స్వాధీనం చేసుకున్నారు.

ఈజీ మనీ కోసం..

నిందితుల్లో ఒకడైన ఆశిష్ సింగ్ వృత్తి రీత్యా అమీర్ పేట్ లో టిఫిన్ సెంటర్ నిర్వహించేవాడు. వ్యాపారం లాభాల్లో లేక ఈజీ మనీ కోసం తన స్నేహితులైన సుమిత్, రమావత్ మోతిలాల్, రమావత్ విజయ్, రాజ్ కుమార్ సింగ్​తో కలిసి విశాఖపట్నం నుంచి తక్కువ ధరలో గంజాయి తీసుకొని ఇక్కడ ఎక్కువ ధరలో అమ్మి లాభాలు పొందేలా ప్రణాళిక రచించుకున్నారు.

మరొకరి వద్ద 30కిలోలు స్వాధీనం

అనుకున్న విధంగా విశాఖపట్నం నుంచి 100 కిలోల గంజాయిని తెప్పించుకొని తాళ్లగడ్డ వద్ద పంచుకునే సమయంలో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వారిని విచారించగా మరో వ్యక్తి 30 కిలోల గంజాయిని తీసుకొని ఇంటికి వెళ్లాడని తేలగా... పోలీసులు అతన్ని కూడా పట్టుకొని మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు. మిగతా నలుగురిని టప్పాఛబుత్ర పోలీసులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.