ETV Bharat / international

ఆ దేశాలకు డబ్ల్యూహెచ్​ఓ 'కరోనా 2.0' హెచ్చరిక - ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు

రెండో దశ కరోనా విజృంభణపై పశ్చిమాసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. శీతాకాలంలో వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని డబ్ల్యూహెచ్​ఓ రీజనల్ డైరక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కొవిడ్ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయాలని సూచించారు.

WHO warns of deadly second wave of virus across Middle East
కరోనా 2.0పై పశ్చిమాసియా దేశాలకు డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక
author img

By

Published : Nov 20, 2020, 5:15 AM IST

పశ్చిమాసియా దేశాల్లో కరోనా 2.0పై తీవ్ర హెచ్చరికలు జారీచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). శీతాకాలంలో వైరస్​ వ్యాప్తి మరింత అధికమయ్యే ప్రమాదముందని డబ్ల్యూహెచ్​ఓ పశ్చిమాసియా రీజనల్​ డైరక్టర్​ అహ్మద్​ అల్​మంధారి అన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్​ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయాలని సూచించారు.

ప్రపంచదేశాలతో పోలిస్తే పశ్చిమాసియా దేశాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉందన్నారు అహ్మద్​. ఈ ఏడాది ఆరంభంలో కఠిన లాక్​డౌన్​ అనంతరం భద్రతా చర్యలు క్రమంగా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేసారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతోనే కొవిడ్​ వ్యాప్తిని అరికట్టవచ్చని పునరుద్ఘాటించారు.

పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటివరకు 36లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 76వేల మందికిపైగా మృతిచెందారు. వారం రోజుల వ్యవధిలో 60శాతానికిపైగా కేసులు ఇరాన్​లోనే బయటపడ్డాయి. జోర్డన్, మొరాకోలోనూ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాక్​లోనూ అన్​లాక్ కారణంగా శీతాకాలంలో కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా వాస్తవ కేసుల సంఖ్య 6.2 రెట్లు అధికం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.