ఇరాక్‌లో రాజకీయ మార్పును కోరుతూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా బస్రాలోని వందలాదిమంది నిరసనకారులు గవర్నరెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ సమీపంలోని ఓ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. పరిస్థితులను అదుపుచేసేందుకు.. నిరసనకారులపై పోలీసులు బాష్పయువులు ప్రయోగించారు. ఈ ఘటనలో 120మంది గాయపడ్డారు.
250 మంది మృతి
కొంతమంది ముసుగులు ధరించి నిరసనకారులపై దాడి చేశారని, ఈ ఘటనలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియా పేర్కొంది. అక్టోబరు 1న మొదలైన నిరసనల్లో ఇప్పటివరకు 250కిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.