Man giving birth from prison: పాలస్తీనాకు చెందిన రాఫత్ అల్ కారావి అనే వ్యక్తి 15 ఏళ్లు ఇజ్రాయెల్‌లోని జైలులో శిక్ష అనుభవించాడు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో నిందితుడిగా తేలిన అతడిని.. 2006లో అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల చట్టం కింద దోషిగా తేల్చి.. 15 ఏళ్ల శిక్ష విధించారు.
Palestine man in Israel prison giving births
ఈ శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే ఆ వ్యక్తి నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు రాఫత్. జైలులో ఉన్న సమయంలో తన భార్యతో శారీరకంగా కలవకపోయినా.. పిల్లలకు ఎలా జన్మనిచ్చాడనే విషయాన్ని తెలియజేశాడు.
"జైలులో ఉన్నప్పుడు.. ఆలూ చిప్స్ బ్యాగులలో నా వీర్యాన్ని ఉంచి బయటకు పంపించేవాడిని. ఈ వీర్యం ప్యాకెట్లను క్యాంటీన్ నుంచి రవాణా చేయగలిగాం. ఈ వీర్యాన్ని నా భార్య నేరుగా ఇన్ఫర్టిలిటీ క్లినిక్‌కు తీసుకెళ్లేది. అక్కడ చికిత్స చేయించుకునేది."
-రాఫత్ అల్ కారావి, జైలు శిక్ష అనుభవించిన ఖైదీ
కుటుంబ సభ్యులు తనను చూడటానికి వచ్చినప్పుడు వారికి సంచిలో ఐదు వస్తువులను ఇస్తాడు రాఫత్. ఇలా వస్తువులను పంపించే వెసులుబాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉంటుంది. జైలు అధికారులు ఖైదీల పేర్లను పిలిచే ముందు.. వీర్యాన్ని ప్యాకెట్లో కడతాడు. వీర్యం ఉన్న చిప్స్ ప్యాకెట్‌పై గుర్తు వేస్తాడు. చిప్స్ ప్యాకెట్లను జైలు అధికారులకు అనుమానం రాకుండా సీల్ చేస్తాడు. అనంతరం.. కుటుంబ సభ్యులకు అప్పజెప్తాడు. వీర్యం ఇవ్వనున్న విషయాన్ని క్రితం సారి వచ్చినప్పుడే కుటుంబ సభ్యులకు చెబుతాడు. 'కుటుంబ సభ్యులను కలిసేటప్పుడు బ్యాగు మీ దగ్గరే ఉంటుంది. జైలు అధికారులు చెకింగ్ చేసిన తర్వాత దాన్ని ఎవరూ ముట్టుకోరు. నేరుగా కుటుంబ సభ్యులకు ఇవ్వొచ్చు. దీన్ని తీసుకొని కుటుంబ సభ్యులు నేరుగా ఫర్టిలిటీ కేంద్రానికి వెళ్తారు' అని రాఫత్ వివరించాడు.
వంద మంది శిశువులు ఇలాగే..
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే 'పాలస్తీనా మీడియా వాచ్' గణాంకాల ప్రకారం.. అనేక మంది ఖైదీలు సంతానం కోసం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. సుమారు వంద మంది చిన్నారులు ఇలా జన్మించి ఉంటారని పాలస్తీనా మీడియా వాచ్ అంచనా. ఈ పద్ధతిపై 'అమరా' అనే పేరుతో సినిమా కూడా తీశారు.
నిజమేనా?
అయితే, చిప్స్ ప్యాకెట్లో వీర్యాన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్న రాఫత్ వ్యాఖ్యలపై వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పురుషుల వీర్యంలోని శుక్ర కణాలు శరీరం బయట సెకన్లు లేదా కొన్ని నిమిషాల పాటే జీవిస్తాయి. అలాంటిది.. వీర్యం జైలులో నుంచి బయటకు తీసుకొచ్చి.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేంత వరకు ఎలా పాడవకుండా ఉందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: 'వీర్యం' సిరంజీతో మహిళలపై దాడి- పదేళ్లు జైలుశిక్ష