ETV Bharat / international

ఇజ్రాయెల్​ నూతన ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ - ఇజ్రాయెల్ నూతన ప్రధాని నాఫ్తాలి బెన్నెట్

ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రిగా నాఫ్తాలి బెన్నెట్ ప్రమాణ స్వీకారం చేశారు. 12 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్​ను పాలించిన బెంజమిన్ నెతన్యాహును గద్దెదించుతూ ఆయన అధికారంలోకి వచ్చారు.

Naftali Bennett
నాఫ్తాలి బెన్నెట్
author img

By

Published : Jun 14, 2021, 12:08 AM IST

Updated : Jun 14, 2021, 11:30 AM IST

ఇజ్రాయెల్ దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు పాలనకు తెరదించుతూ ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారాన్ని చేపట్టారు. ప్రధాని పీఠం కోసం నిర్వహించిన విశ్వాస పరీక్షలో తాజా మాజీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఒక ఓటు తేడాతో ఓడిపోయారు. 120 మంది సభ్యులు గల ఇజ్రాయెల్ పార్లమెంటు 'నెస్సెట్'లో 60 మంది బెంజమిన్‌కు వ్యతిరేకంగా, 59 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

కొత్త ప్రధానిగా నియమితులైన 49ఏళ్ల నాఫ్తాలీ బెన్నెట్‌ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. బెన్నెట్​తో పాటు.. 27 మంది మంత్రులు కొలువుదీరారు. తొమ్మిది మంది మహిళలకు కేబినేట్​లో చోటు దక్కడం విశేషం. సిద్ధాంత పరంగా భిన్నమైన రాజకీయ పార్టీల కూటమితో ప్రస్తుత కూటమి ఏర్పాటైంది. దీనిలో అరబ్ పార్టీతో పాటు.. అతివాద, వామపక్ష పార్టీలున్నాయి. ఇజ్రాయెల్‌ చరిత్రలో మొదటిసారిగా అరబ్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

తొలి ప్రసంగం..

భిన్నాభిప్రాయాలు గల రాజకీయ పార్టీలతో అధికారాన్ని పంచుకుంటున్నందుకు గర్వపడుతున్నట్లు బెన్నెట్ తన మొదటి ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెతన్యాహుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

"సరైన సమయంలో మా కూటమి బాధ్యతలు చేపట్టింది. ఇంతకముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికలు, ద్వేషం వంటి లక్షణాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇజ్రాయెల్​లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న బాధ్యతాయుతమైన నేతలు దేశాన్ని కాపాడేందుకు ఇది సరైన సమయం."

-నాఫ్తాలి బెన్నెట్, ఇజ్రాయెల్ ప్రధాని

ప్రధానిగా సుదీర్ఘకాలం..

ఇక బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్‌ ప్రధానిగా ఉన్నారు. 1996-99 మధ్య తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు (2009, 2013, 2015, 2020) ఈ పదవిలో కొనసాగుతున్నారు.

ఇవీ చదవండి: ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్

నెతన్యాహును గద్దె దించేందుకు రంగం సిద్ధం!

Last Updated : Jun 14, 2021, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.