ETV Bharat / international

టర్కీని మాఫియా నీడ వీడలేదా? - టర్కీ

టర్కీలో ఎర్డోగాన్​ పాలన, ఆయన పార్టీలోని కీలక వ్యక్తుల బాగోతం గురించి సెదెత్​ పీకర్​ అనే మాఫియా డాన్​ యూట్యూబ్​ వేదికగా సంచలన విషయాలు వెల్లడించారు. టర్కీ ఇంకా మాఫియా గుప్పిట్లో ఉందనే అనుమానాల్ని కలిగించాడు. సిరియాలోని అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు రెసెప్ తయ్యిప్​ ఎర్డోగాన్​ మాజీ భద్రత సలహాదారు ఆయుధాలు సరఫరా చేశారని ఆరోపించి.. ఇంతవరకు ఈ విషయంలో టర్కీపై ఉన్న విశ్లేషకుల అనుమానాలకు బలం కలిగించాడు.

Turkey
టర్కీ
author img

By

Published : Jun 8, 2021, 3:11 PM IST

దశాబ్దాలుగా మాఫియా గుప్పిట్లో కీలుబొమ్మైన టర్కీ.. మళ్లీ వారి కనుసైగల్లోనే నడుస్తుందా? 1970 నుంచి మాఫియా శాసించిన టర్కీ.. వారి దుర్మార్గాల నుంచి బయటపడి దశాబ్ద కాలం కావొస్తున్నట్లు అనిపిస్తున్నా.. పరోక్షంగా వారే టర్కీని నడిపిస్తున్నారా?

2009 నుంచి గాడ్​​ ఫాదర్​లు(మాఫియా డాన్స్​) కొందరు కటకటాల్లోకి వెళ్లిపోయినా.. మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా.. "గాడ్​ ఫాదర్స్..​ అందరూ గాఢ నిద్రలో ఉన్నారని" 2011లో ఓ సీనియర్ పోలీసు​ అధికారి పేర్కొన్నా.. టర్కీకి అన్​అఫిషియల్​ కింగ్స్​ గాడ్​ ఫాదర్సేనా?

అనుమానంగానైనా సరే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పుడెందుకు సడెన్​గా ఈ విషయాలు చెప్పుకోవాల్సి వస్తోంది అనుకుంటున్నారా? మాములుగా అయితే ఇవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్​, ఆర్థిక నేరస్థుడు సెదెత్​ పీకర్​ (రెసెప్ తయ్యిప్​ ఎర్డోగాన్​​ పార్టీకి ఒకప్పటి మద్ధతుదారుడు)​ యూట్యూబ్​లో సంచలన విషయాలు వెల్లడించడం వల్ల ఇది మళ్లీ చర్చకు వచ్చింది.

ఇంతకీ ఆయనేం చెప్పారంటే..

  • సిరియాలోని అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు ఎర్డోగాన్​ మాజీ భద్రత సలహాదారు ఆయుధాలు సరఫరా చేశారని ఆరోపించాడు.
  • అప్పట్లో కజక్​ జర్నలిజం విద్యార్థిని, మాజీ హోంమంత్రి మెహ్​మెత్​ అగర్​ కుమారుడు, ప్రస్తుతం అధికార పార్టీ చట్టసభ్యుడు తోల్గా.. రేప్​ చేసి చంపేసి.. అది అనుమానస్పద మృతిగా మార్చాడని ఆరోపించారు.
  • మాజీ ప్రధాని బినాలీ ఇల్​దిరిమ్స్​ కుమారుడికి డ్రగ్స్​ స్మగ్లింగ్​లో భాగస్వామ్యం ఉందని తెలిపాడు.
  • అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసినప్పడు వాటిని ఆర్పడానికి సహాయపడ్డానని కానీ అవన్నీ మర్చిపోయి ప్రస్తుత హోం మంత్రి సులేమాన్​ సోయ్లూ తనను మోసం చేశారని ఆరోపించాడు.

అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు మాత్రం చూపలేదు.

ఈ వీడియో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ల మంది వీక్షించారు. కాగా ఈ ఆరోపణలపై చాల కాలంగా మౌనం వహిస్తూ వస్తున్న ఎర్డోగాన్​ మే 26న నోరు విప్పారు. అవన్నీ అవాస్తవమని ఒక్కమాటలో కొట్టి పారేశారు. కానీ లేటెస్ట్​గా సెదెత్ వీడియోలో వెల్లడించిన పై విషయాలు నమ్మేవిగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టర్కీ ప్రభుత్వం చాలా 'క్లీన్'​ అని చెప్పుకున్న అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్​ ఎర్డోగాన్​ మాటలు వట్టివేనని అనుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఉగ్రసంస్థలతో ఆ అధ్యక్షుడికి సన్నిహిత సంబంధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.