ETV Bharat / international

అపార్ట్​మెంట్​ను తాకిన ఇజ్రాయెల్ రాకెట్ - ఇజ్రాయెల్ దాడులు

రాకెట్ దాడులతో ఇజ్రాయెల్​ సరిహద్దు అట్టుడికిపోతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రయోగించిన ఓ రాకెట్.. గాజాలోని అపార్ట్​మెంట్​ను తాకింది. ఈ దాడుల్లో పలువురు ముష్కరులు మరణించారని పాలస్తీనా మీడియా తెలిపింది.

ISRAEL ROCKET HITS APARTMENT BUILDING
గాజాలోని అపార్ట్​మెంట్​ను తాకిన ఇజ్రాయెల్ రాకెట్
author img

By

Published : May 11, 2021, 6:33 PM IST

అపార్ట్​మెంట్​ను తాకిన ఇజ్రాయెల్ రాకెట్

ఇజ్రాయెల్ రాకెట్ దాడుల్లో గాజాలోని అపార్ట్​మెంట్ ధ్వంసమైంది. నగరం మధ్యలో ఉండే ఓ ఆకాశహర్మ్యాన్ని ఓ రాకెట్ ఢీకొట్టింది. ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న ఈ దాడుల్లో కొంతమంది ఉగ్రవాదులు చనిపోయారని పాలస్తీనా మీడియా తెలిపింది.

దాడుల అనంతరం స్థానిక ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. భయాందోళనతో నగరానికి దూరంగా వెళ్లి తలదాచుకుంటున్నారు.

అంతకుముందు, హమాస్ ఉగ్రవాద నాయకుడి స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ రాకెట్ దాడులు చేసింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు 19ఏళ్ల దివ్యాంగ కుమారుడు మరణించాడని పాలస్తీనా అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ దాడుల్లో 24 మంది మృతి చెందారు.

సోమవారం నుంచి గాజా తీవ్రవాదులు ఇజ్రాయెల్​పై దాడులు చేస్తున్నారు. 250కి పైగా రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.

ఇదీ చదవండి: సరిహద్దులో ఉద్రిక్తత- రంగంలోకి అదనపు సైన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.