భారత్‌కు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది ఇజ్రాయెల్. బాలీవుడ్లో ప్రాచుర్యం పొందిన పాట 'యే దోస్తీ'తో ట్విట్టర్లో సందేశాన్ని పంపించింది. ఇందులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నేతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు సమావేశాల్లో కలుసుకున్న చిత్రాలు ఉన్నాయి. భారత్‌తో ఇజ్రాయెల్‌కు ఉన్న బంధాన్ని తెలిపేలా వీడియోను రూపొందించారు.
ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం కావాలని కోరుతూ ట్వీట్ చేసింది భారత్‌లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం.
-
Happy #FriendshipDay2019 India!
— Israel in India (@IsraelinIndia) August 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
May our ever strengthening friendship & #growingpartnership touch greater heights.
🔊🎧🎶 ये दोस्ती हम नहीं तोड़ेंगे..... 🇮🇱❤🇮🇳 pic.twitter.com/BQDv8QnFVj
">Happy #FriendshipDay2019 India!
— Israel in India (@IsraelinIndia) August 4, 2019
May our ever strengthening friendship & #growingpartnership touch greater heights.
🔊🎧🎶 ये दोस्ती हम नहीं तोड़ेंगे..... 🇮🇱❤🇮🇳 pic.twitter.com/BQDv8QnFVjHappy #FriendshipDay2019 India!
— Israel in India (@IsraelinIndia) August 4, 2019
May our ever strengthening friendship & #growingpartnership touch greater heights.
🔊🎧🎶 ये दोस्ती हम नहीं तोड़ेंगे..... 🇮🇱❤🇮🇳 pic.twitter.com/BQDv8QnFVj
" భారత్‌కు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మన స్నేహం మరింత దృఢమవ్వాలి. ఇరు దేశాల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరాలి. "
- ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ట్వీట్.
మోదీ ధన్యవాదాలు...
ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇజ్రాయెల్ యూదుల భాషలో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
" ధన్యవాదాలు, ఇజ్రాయెల్ ప్రజలు, నా స్నేహితుడు ప్రధాని బెంజమన్ నేతన్యాహూకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. భారత్, ఇజ్రాయెల్ బంధం బలమైంది, శాశ్వతమైంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలి."
- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.
ప్రధాని మోదీ, నేతన్యాహూ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరువురి మధ్య ద్వైపాక్షిక భేటీల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత పర్యటనకు రానున్నారు నేతన్యాహూ.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు