తన అణుకేంద్రంపై విధ్వంసకర దాడిని ఇరాన్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ మేరకు ఓ ఇరాన్ వార్తా సంస్థ వెల్లడించింది.
అణు స్థావరంపై దాడి జరగడానికి ముందే భద్రతా బలగాలు అప్రమత్తమై.. అడ్డుకున్నాయని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు దగ్గరగా ఉండే నోర్న్యూస్ అనే వార్తా సంస్థ తెలిపింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారని వెల్లడించింది.
దాడి జరిగిన భవనం కారజ్ నగరానికి దగ్గర్లో ఉందని ఐఎన్ఎస్ఏ అనే మరో న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే దీనిపై అధికారులు ఎవరూ స్పందించలేదు. అయితే.. ఇది ఉగ్రవాదుల పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ నతాంజ్‌లోని అణు కర్మాగారంపై ఏప్రిల్ నెలలో సైబర్ దాడి జరిగింది. ఇది ఇజ్రాయెల్ పనేనని ఆ దేశ మీడియా పేర్కొంది. నతాంజ్‌లోని అణు కర్మాగారంలో యంత్రాన్ని పనిచేయించడం మొదలుపెట్టిన కొద్ది గంటలకే అనూహ్యంగా అక్కడ విద్యుత్ పంపిణీ కుప్పకూలింది.
ఇవీ చూడండి: