ప్రాంతీయ సమస్యలపై చర్చల కోసం ఇరాన్, సౌదీ అరేబియా ప్రత్యక్ష చర్చలు ప్రారంభించాయి. బాగ్దాద్(ఇరాక్ రాజధాని) వేదికగా ఈ నెలారంభంలో చర్చలు జరిగాయని ఇరాక్ అధికారులు తెలిపారు.
ఏళ్ల తరబడి శత్రుత్వం ఉన్న ఈ దేశాల మధ్య.. చర్చలు ప్రారంభం కావడం సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. అయితే.. ఈ చర్చల వల్ల వెనువెంటనే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. సౌదీ-ఇరాన్ ఘర్షణల మధ్య నలిగిపోయిన ఇరాక్కు తాజా పరిణామాలు ఉపశమనం కలిగించే అంశాలే.
ఇరాన్ మద్దతిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులతో యెమెన్లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని సౌదీ యోచిస్తోంది. తమపై ఉన్న ఆంక్షలను తొలగించుకోవాలని చూస్తున్న ఇరాన్.. సౌదీతో చర్చలు ఇందుకో మార్గంగా భావిస్తోంది.
ఇదీ చదవండి: 53 మందితో ఇండోనేసియా జలాంతర్గామి గల్లంతు