ఇరాక్‌లోని అమెరికా బలగాల స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణుల దాడులు జరిగినట్లు పెంటగాన్ తెలిపింది. ఇది ఇరాన్ పనేనని, దాదాపు డజనుకుపై బాలిస్టిక్ క్షిపణులను అమెరికా బలగాల స్థావరాలపై ప్రయోగించారని అగ్రరాజ్యం ఆరోపించింది. ఇరాక్‌లో ప్రస్తుత పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు డొనాల్జ్ ట్రంప్ పర్వవేక్షిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.
తమ ఉన్నత కమాండర్ ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారం ఈ దాడులను ప్రారంభిస్తున్నట్లు ఇరాన్ స్థానిక మీడియా పేర్కొంది.