ETV Bharat / international

'ఆ పని మాది కాదు.. తీవ్రంగా ప్రతిఘటిస్తాం' - సౌదీ చమురు ప్లాంట్లపై దాడి

అమెరికా తమపై చేస్తున్న ఆరోపణలకు ఘాటుగా బదులిచ్చింది ఇరాన్​. సౌదీ చమురు ప్లాంట్లపై దాడితో సంబంధం లేదని స్పష్టం చేసిన ఇరాన్​.. తమపై చర్యలు చేపడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు స్విస్​ రాయబారి చేత అమెరికాకు దౌత్యపరమైన నోటీసులు అందించింది​.

'ఆ పని మాది కాదు.. తీవ్రంగా ప్రతిఘటిస్తాం'
author img

By

Published : Sep 18, 2019, 4:45 PM IST

Updated : Oct 1, 2019, 2:04 AM IST

సౌదీ అరేబియా చమురు ప్లాంట్లపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ... అమెరికాకు దౌత్యపరమైన నోటీసులు పంపించింది ఇరాన్​. తమపై ఎలాంటి చర్యలకైనా పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అగ్రరాజ్యానికి స్పష్టం చేసింది​.

చమురు ప్లాంట్లపై శనివారం జరిగిన డ్రోన్​ దాడి ఇరాన్​ పనేనని అమెరికా పదేపదే ఆరోపిస్తున్న తరుణంలో ఈ నోటీసులను తెహ్రాన్​లోని స్విస్​ రాయబారి చేత అగ్రరాజ్యానికి అందజేసింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల 1980 నుంచి స్విస్​ రాయబారితోనే అగ్రరాజ్యం.. ఇరాన్​తో సంప్రదింపులు జరుపుతోంది .

సౌదీలోని ఆరామ్​కో, ఖురైస్​ చమురు ప్లాంట్లపై దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. చమురు సరఫరా నిలిపివేస్తూ సౌదీ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయిల్​ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

ఇదీ చూడండి:- సౌదీ డ్రోన్​ దాడి వెనకున్నది ఇరానే: అమెరికా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 2:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.