ETV Bharat / international

అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్ - ఇరాన్

తమ దేశంలోని అణు కర్మాగారంపై జరిగిన దాడి ఇజ్రాయెల్ పనేనని నిందించింది ఇరాన్. దీనికి ఇజ్రాయెల్ దారిలోనే బదులిస్తామని హెచ్చరించింది. దాడికి గురైన అణు కర్మాగారాన్ని మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతామని పేర్కొంది.

Iran blames Israel for sabotage at Natanz nuclear site
అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్
author img

By

Published : Apr 12, 2021, 7:11 PM IST

Updated : Apr 12, 2021, 8:52 PM IST

నతాంజ్​లోని ఆధునాతన అణు కర్మాగారంపై జరిగిన దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్​పై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ దాడికి సమాధానమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్ ఖతిబ్జదే పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దారిలోనే వారికి సమాధానం చెబుతామని అన్నారు. అణు కర్మాగారంలోని ఐఆర్-1 సెంట్రిఫ్యూజ్​లు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వలేదు.

మరోవైపు, నతాంజ్ అణు కర్మాగారాన్ని పునర్నిర్మిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావెద్ జరీఫ్ స్పష్టం చేశారు. యురేనియంను మరింత వేగంగా శుద్ధి చేసే అధునాతన యంత్రాలతో కర్మాగారాన్ని తీర్చిదిద్దుతామని హెచ్చరించారు.

"ఆంక్షలు ఎత్తివేసే దిశగా ఇరాన్ ప్రజలు సాధించిన విజయానికి వ్యతిరేకంగా జియోనిస్టులు(ఇజ్రాయెల్ మద్దతుదారులు) ప్రతికారం తీర్చుకోవాలనుకుంటున్నారు. కానీ దాన్ని మేం అనుమతించం. జియోనిస్టుల చర్యలకు ప్రతికారం తీర్చుకుంటాం."

-మహమ్మద్ జావెద్ జరీఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి

మరోవైపు, అణు కేంద్రం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఇరాన్ పౌర అణు కార్యక్రమ అధిపతి అక్బర్ సలేహి తెలిపారు. దాడి జరిగినప్పటికీ.. ఇక్కడ యురేనియం శుద్ధి నిలిచిపోలేదని పేర్కొన్నారు.

దాడి తర్వాత మంటలు

కాగా, దాడి తమ దేశమే చేసిందని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇరాన్ మాత్రం ఈ దాడి గురించి వివరాలను గోప్యంగా ఉంచుతోంది. తొలుత గ్రిడ్​లో విద్యుత్ ఆగిపోయిందని ప్రకటించింది. అనంతరం.. ఇది దాడేనని నిర్ధరించింది. దాడి తర్వాత ఘటనాస్థలిలో మంటలు చెలరేగాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్​ మాజీ అధిపతి వెల్లడించారు. ఇది ఈ ఏడాది నతాంజ్​లో జరిగిన రెండో దాడి అని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలేవీ బయటకు రాలేదు. అయితే దాడి తర్వాత పరిణామాలు తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత అక్కడికి వెళ్లిన ఓ నిపుణుడు నేలపై పడి ఉన్న అల్యూమినియం శిథిలాలపై నడుస్తూ.. ఏడు మీటర్ల కిందకు పడిపోయాడని స్థానిక వార్తా ఛానెళ్లు పేర్కొంటున్నాయి. ఆయన రెండు కాళ్లు విరిగిపోవడమే కాక.. తలకు బలమైన గాయాలు అయ్యాయని తెలిపాయి.

ఈ చర్యతో ఇరాన్​తో మరోసారి అణు ఒప్పందం కుదర్చుకోవాలని అనుకుంటున్న అమెరికా, ఎలాగైనా దానిని ఆపాలని చూస్తున్న ఇజ్రాయెల్​ మధ్య సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

వచ్చే వారం అమెరికా-ఇరాన్​ మధ్య చర్చలు

ఇరాన్ నుంచి చమురు కొనుగోలుకు భారత్​ సిద్ధం!

Last Updated : Apr 12, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.