చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి వ్యూహాత్మక నిఘా సామర్థ్యాన్ని భారత్ మరింత మెరుగుపరచుకోనుంది. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి నాలుగు అధునాతన హెరాన్ మార్క్-2డ్రోన్ల(Heron drones)ను సమకూర్చుకోనుంది. ఈ లోహవిహంగాల్లో దీర్ఘశ్రేణి రాడార్లు, సెన్సార్లు ఉన్నాయి. హెరాన్ డ్రోన్లలోని కమ్యూనికేషన్ వ్యవస్థలను జామ్ చేయడం శత్రుదేశాలకు సాధ్యం కాదు. అలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు వాటిలో యాంటీ జామింగ్ వ్యవస్థ ఉంది.
ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో రెండు డ్రోన్లు మన దేశానికి అందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. మిగతావి ఈ ఏడాది చివరి కల్లా వస్తాయని పేర్కొన్నాయి. 3,488 కిలో మీటర్ల మేర విస్తరించిన LAC వెంబడి ఎలాంటి లోపాలకు తావులేని విధంగా ఎప్పటికప్పుడు నిఘా వేయడానికి ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని వివరించాయి.
ఇదీ చదవండి: అమెరికా పర్యటనలో జైశంకర్ బిజీబిజీ