పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడులకు ప్రతిగా హమస్ ఉగ్రవాద సంస్థ సైతం దాడులు కొనసాగిస్తోంది. మంగళవారం గాజాలో ఓ ఆరంతస్తుల భవనాన్ని ఇజ్రాయెల్ కూల్చివేయగా.. గాజా నుంచి జరిపిన రాకెట్ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లో ఇద్దరు థాయ్‌లాండ్ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్‌లో ఆ దేశానికి వ్యతిరేకంగా పాలస్తీనీయన్లు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వెస్ట్‌బ్యాంక్ రమల్లాలో ఆందోళనకారులు ఇజ్రాయెల్ సైనిక చెక్‌పోస్ట్‌పైకి రాళ్లు విసిరారు. దీంతో భద్రతా బలగాలు భాష్పవాయువు ప్రయోగించాయి.
ఆందోళనల్లో ఒక నిరసనకారుడు ప్రాణాలు కోల్పోగా, 46 మంది గాయపడ్డారు. ఇద్దరు సైనికులకు సైతం గాయాలయ్యాయి.
ఇదీ చదవండి : 'ఇజ్రాయెల్-గాజా' కాల్పుల విరమణకు బైడెన్ మద్దతు