ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఓ ఆస్పత్రిలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది కొవిడ్ రోగులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇబ్న్ అల్-ఖతీబ్ ఆస్పత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 36 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీనిపై ఇరాక్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రమాద సమయంలో 120 మంది రోగులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో ఓ ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని.. ఇద్దరు వైద్యులు ఈ ఘటనను చూసినట్లు చెప్పారని అధికారులు తెలిపారు. ఆస్పత్రి వర్గాలు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేశారు. సహాయకచర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: అమెరికాలో కాల్పులు.. ఆరుగురు దుండగులు మృతి