2018లో సంచలనం సృష్టించిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో భాగంగా ఖషోగ్గీ కాబోయే భార్య తరఫున హేటీస్ సెంగీజ్ అనే మానవ హక్కుల సంస్థ మంగళవారం ఫెడరల్ పిటిషన్ దాఖలు చేసింది.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో పాటు అతని మంత్రివర్గంలోని కొందరు అధికారులు పక్కా ప్రణాళికతో ఖషోగ్గీని హతమార్చారని పిటిషన్ లో పేర్కొన్నారు.
" జమాల్ ఖషోగ్గీకి అమెరికా అంటే విశ్వాసం ఉంది. అమెరికాలో ఏదైనా సాధ్యపడుందని అతని నమ్మకం. ఇక్కడ మాకు న్యామం జరుగుతుందని ఆశిస్తున్నాం."
---హేటీస్ సెంగీజ్ మానవ హక్కుల సంస్థ
గతంలో ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురు అధికారులకు సౌదీ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
ఖషోగ్గీ మరణం..
అక్టోబరు 2, 2018న సౌదీఅరేబియా ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లిన ఖషోగ్గీ తిరిగి రాలేదు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు ఖషోగ్గీని కిరాతకంగా కార్యాలయంలోనే హతమార్చారు.