మోటార్ పడవల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ రాజధాని వెనిస్లో నిరసనలు చేపట్టారు స్థానికులు. వీటి వినియోగం వల్ల రోజురోజుకూ నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పడవలు వేగంగా ఒడ్డుకు రావటం వల్ల ఏర్పడే అలల ధాటికి చారిత్రక కట్టడాలు ధ్వంసమవుతున్నాయని చెబుతున్నారు.
సెయింట్ మార్క్స్ స్క్వేర్ ఎదుటనున్న ఓ పెద్ద నీటికొలనులో పదుల సంఖ్యలో రోయింగ్ బోట్లతో శాంతియుతంగా తమ నిరసనలు తెలిపారు. క్రూయిజ్ పడవలు ఎక్కువగా వినియోగించటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని ప్లకార్డులను ప్రదర్శించారు.