యెమెన్లో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకర ఘర్షణలు (Yemen news) జరుగుతున్నాయి. దక్షిణ రాష్ట్రం షాబ్వాలో వరుసగా మూడో రోజు జరిగిన దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 35 మంది చనిపోయినట్లు అధికారులు, గిరిజన ప్రాంత నేతలు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు వెల్లడించారు.
దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
2014లో ఇరాన్ మద్దతుతో హౌతీలు (Yemen News) రాజధాని సనాను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్లో అంతర్యుద్ధం (Yemen Civil War) మొదలైంది. సనా సహా దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియాకు తరలిపోవాల్సి వచ్చింది.
ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది. హౌతీ స్థావరాలపై అనేక సార్లు వైమానిక దాడులు జరిపింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో యెమెన్లో తీవ్రమైన మానవతా సంక్షోభం (Yemen Humanitarian Crisis) ఏర్పడింది.
ఇదీ చూడండి: యెమెన్లో క్షిపణి దాడి- 17 మంది మృతి