ETV Bharat / international

జోర్డాన్​ సైనిక గిడ్డంగిలో భారీ పేలుళ్లు - Jordan updates

జోర్డాన్​ రాజధాని జర్కాలో భారీ పేలుళ్లు సంభవించాయి. సైన్యానికి చెందిన ఓ గిడ్డంగిలో ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా గిడ్డంగి సహా.. చుట్టుపక్కల ప్రాంతాలకు అలర్ట్​ చేశారు అధికారులు.

Blasts rock munitions depot in Jordan Capital Zarka
జోర్డాన్​లోని ఓ సైనిక గిడ్డంగిలో భారీ పేలుళ్లు
author img

By

Published : Sep 11, 2020, 5:57 PM IST

జోర్డాన్​లో భారీ పేలుళ్లు సంభవించాయి. దేశ రాజధాని జర్కాలో సైన్యానికి చెందిన ఓ గిడ్డంగిలో శుక్రవారం ఉదయం పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. విద్యుత్ షాట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వారు చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదస్థలం సహా చుట్టుపక్కల ఇతర ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

జోర్డాన్​లోని ఓ సైనిక గిడ్డంగిలో భారీ పేలుళ్లు

కొంతకాలంగా గిడ్డంగిలో మోర్టార్​ గుండ్లు నిల్వ ఉండగా.. ఇటీవలి కాలంలో అవి నిరుపయోగంగా మారాయి. అయితే.. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అందులోని రసాయనాలు పేలాయని భద్రతా బలగాలు తెలిపాయి.

బీరుట్​ సమీపంలోనే..

గతనెలలో భారీ పేలుడు సంభవించిన లెబనాన్​ ప్రాంతానికి సమీపంలోనే జర్కా ఉంది. ఆగస్టు 4న జరిగిన ఈ దుర్ఘటనలో బీరుట్​ ఓడరేవులోని 3వేల టన్నుల అమోనియం నైట్రేట్​ పేలుడుకు కారణమైంది. ఈ ప్రమాదంలో సుమారు 192 మంది ప్రాణాలు కోల్పోగా.. 6,500 మంది క్షతగాత్రులయ్యారు.

ఇదీ చూడండి: బీరుట్​ పోర్టులో మరో భారీ ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.