ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మంచు చరియలు విరిగిపడి 12 మంది మృతిచెందారు. ఉత్తర టెహ్రాన్‌లోని అల్బోర్స్ పర్వత శ్రేణుల్లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులు, హిమపాతమే ఇందుకు కారణం. గల్లంతైన వారిలో 14 మందిని సహాయక బృందం శనివారం కనుగొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
పెడచెవిన పెట్టారు..
ఆచూకీ లభ్యమైన వారిలో 11 మంది అప్పటికే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారని స్థానిక మీడియా తెలిపింది. బలమైన గాలులపై వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను చాలా మంది పెడచెవిన పెట్టారని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'త్వరలో అందరికీ సరిపడా టీకాలు'