రాకెట్ దాడులతో జెరూసలెం దద్దరిల్లింది. అల్-అక్సా మసీదు ప్రాంగణాన్ని ఇజ్రాయెల్ బలగాలు ఖాళీ చేయాల్సిందిగా గాజాలోని హమాస్ మిలిటెంట్ గ్రూప్ గడువు విధించిన కొద్దిసేపటికే ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ దాడులకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ బాధ్యత వహించింది. జెరూసలెంలోని పాలస్తీనా వాసులపై ఇజ్రాయెల్ ఆగడాలకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేపట్టినట్లు హమాస్ ప్రతినిధి అబూ ఓబీడా వెల్లడించారు. ఈ సందేశాన్ని శత్రువు బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని.. ఇజ్రాయెల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అల్-అక్సా మసీదును ఇజ్రాయెల్ ఆక్రమించుకోవాలని చూసినా.. తూర్పు జెరూసలెం పరిసరాల్లోని పాలస్తీనా ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించేదుకు ప్రయత్నించినా మరిన్ని దాడులు తప్పవని హమాస్ ప్రతినిధి హెచ్చరికలు జారీచేశారు.
ఈ దాడుల్లో గాయపడిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
ఇవీ చదవండి: జెరూసలెంలో ఘర్షణలు- 200 మందికి గాయాలు!