ETV Bharat / international

'ఎయిర్​ఇండియాపై రెండు వారాల పాటు నిషేధం' - ariindia in dubai

కరోనా నిబంధనలు పాటించనందువల్ల ఎయిర్​ఇండియా విమానాలపై దుబాయ్​ ప్రభుత్వం రెండు వారాలు నిషేధం విధించింది. సెప్టెంబర్​ 18 నుంచి అక్టోబర్​ 2 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. కొవిడ్ పాజిటివ్ ధ్రువపత్రాలు ఉన్నా.. గడిచిన రెండు వారాల్లో ఇద్దరు ప్రయాణికులను తీసుకొచ్చిందని ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

Air India
ఎయిర్​ఇండియా
author img

By

Published : Sep 19, 2020, 5:06 AM IST

కరోనా నిబంధనలపై నిర్లక్ష్యం వహించిన ఎయిర్​ఇండియా విమానాలపై దుబాయ్‌ పౌర విమానయాన శాఖ వేటు వేసింది. అక్టోబర్‌ 2 వరకు ఈ విమానాల రాకలపై నిషేధం విధించింది. కొవిడ్ పాజిటివ్ ధ్రువపత్రాలు కలిగినా కూడా గడిచిన రెండు వారాల్లో ఇద్దరు ప్రయాణికులను తీసుకొచ్చిందని పేర్కొంది.

కరోనా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది దుబాయ్​ ప్రభుత్వం. అక్టోబర్ 2 వరకు ఎయిర్​ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వాధికారులు శుక్రవారం వెల్లడించారు.

రెండోసారి..

"సెప్టెంబర్‌ 2వ తేదీన పాజిటివ్‌గా నిర్ధరణ అయిన ఓ ప్రయాణికుడు సెప్టెంబర్‌ 4న ఎయిర్​ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో జైపుర్‌ నుంచి దుబాయ్‌ చేరుకున్నాడు. గడిచిన రెండు వారాల్లో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి" అని ఓ అధికారి తెలిపారు.

రెండు వారాలు..

ఈ నేపథ్యంలోనే ఎయిర్​ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌ నుంచి దుబాయ్‌కి వెళ్లే ప్రతి ప్రయాణికుడు కొవిడ్‌ నెగటివ్‌ ధ్రువపత్రాన్ని తీసుకురావాలని యూఏఈ ప్రభుత్వం గతంలోనే పేర్కొంది.

ఎయిర్​ఇండియా స్పందన..

తాజా నిర్ణయంపై భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ స్పందించింది. ప్రయాణికులకు కలిగే ఇబ్బందులు తొలగించడంపై దృష్టిసారించినట్లు పేర్కొంది. శుక్రవారం భారత్‌ నుంచి షార్జాకు వెళ్లాల్సిన నాలుగు విమానాలను అనుమతించాలని దుబాయ్‌ పౌర విమానయాన శాఖను కోరింది.

ఇదీ చూడండి: ఇంట్లోనే కరోనా టెస్ట్​- గంటలో ఫలితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.