ETV Bharat / international

అమెరికా సమక్షంలో అఫ్గాన్​, తాలిబన్ల శాంతి చర్చలు - దోహా ఒప్పందం

దశాబ్దాల వివాదానికి తెరదించే దిశగా అఫ్గానిస్థాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఖతార్​ రాజధాని దోహాలో ఈ శాంతి చర్చలను నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించనున్నాయి.

afghan taliban talks
అఫ్గాన్​, తాలిబన్ల శాంతి చర్చలు
author img

By

Published : Sep 12, 2020, 2:02 PM IST

దశాబ్దాల సంఘర్షణ తరువాత.. అఫ్గానిస్థాన్​, తాలిబన్ల మధ్య శాశ్వత శాంతి కోసం మరోసారి అడుగులు పడ్డాయి. ఖతార్ రాజధాని దోహాలో అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్​ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో హాజరయ్యారు.

అఫ్గాన్​, తాలిబన్ల శాంతి చర్చలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, తాలిబ‌న్ మ‌ధ్య కుదిరిన భద్రతా ఒప్పందంలో భాగంగా ఈ చర్చలను నిర్వహిస్తున్నారు. చర్చలు సఫలమైతే అఫ్గాన్​ నుంచి అమెరికా, నాటో దళాలు నిష్క్రమించేందుకు మార్గం సుగమవుతుంది.

ఇదే తొలిసారి..

ఫిబ్రవరి ఒప్పందం తర్వాత ఆఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ఖైదీల అప్పగింత వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చలపై కొంతకాలం సందిగ్ధం నెలకొంది. అయితే, అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య నేరుగా చర్చలు జరగటం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.