ETV Bharat / international

యూఏఈలో అష్రఫ్​ ఘనీ- అరెస్టు కోసం అఫ్గాన్​ ప్రయత్నాలు

అఫ్గానిస్థాన్​ అధికార పగ్గాల్ని తాలిబన్లు హస్తగతం చేసుకునే సమయంలో దేశాన్ని వీడిన అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ ఆచూకీపై స్పష్టత వచ్చింది. ఆయన కుటుంబసభ్యులతో కలిసి తమ దేశంలోనే ఉన్నట్టు యూఏఈ వెల్లడించింది. మరోవైపు.. ఆయన్ను అరెస్టు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అఫ్గాన్ రక్షణ మంత్రి తెలిపారు.

UAE ashraf ghani
అష్రఫ్ ఘనీ
author img

By

Published : Aug 18, 2021, 7:46 PM IST

ప్రజాస్వామ్యాన్ని తాలిబన్లు కాలరాసి, అఫ్గానిస్థాన్​ అధికార పగ్గాల్ని లాక్కుంటున్న కీలక సమయంలో దేశం విడిచి పరారైన అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ ప్రస్తుతం యూఏఈలో ఉన్నట్టు స్పష్టమైంది. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశ్రయం ఇచ్చినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​ ప్రభుత్వం తెలిపింది. అయితే ఘనీ ఎక్కడ ఉన్నారన్న విషయం కచ్చితంగా చెప్పలేదు.

అరెస్టు కోసం యత్నం

అంతకుముందు... అష్రఫ్​ ఘనీ అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అఫ్గాన్ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్. ఈమేరకు ఇంటర్​పోల్​ను తజకిస్థాన్​లోని అఫ్గాన్ రాయబార కార్యాలయం కోరినట్టు వెల్లడించారు. మాతృభూమిని అమ్మేసిన వ్యక్తులను అరెస్టు చేసి, శిక్షించాల్సిందేనని ట్వీట్ చేశారు బిస్మిల్లా.

ఇదీ చదవండి:

తాలిబన్లపై ధిక్కార స్వరం- ప్రధాన నగరాల్లో ప్రజల నిరసనలు!

తాలిబన్లకు బైడెన్ షాక్- నిధులు అందకుండా ఆంక్షలు

వారి కోసం తాలిబన్ల వేట- ఇంటింటికీ వెళ్లి సోదాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.