పాలస్తీనా స్వయంపాలిత ప్రాంతమైన గాజా నుంచి మంగళవారం రాత్రి 15 రాకెట్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ భద్రత దళాలు వెల్లడించాయి. ఇందుకు ప్రతిదాడులు చేసినట్లు తెలిపాయి. గాజాలోని హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన ఆయుధ తయారీ కర్మాగారం సహా సైనిక కాంపౌండ్‌ను ఇజ్రాయెల్ వాయుసేన ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి.
ఇజ్రాయెల్‌పై ఎలాంటి దాడులు జరిగినా తీవ్రంగా స్పందించేందుకు సిద్ధంగా ఉంటామని భద్రత బలగాలు స్పష్టం చేశాయి. అంతకుముందు, దక్షిణ ఇజ్రాయెల్‌లో వైమానిక దాడి సైరన్లు వినిపించినట్లు ఆర్మీ తెలిపింది. యూఏఈ, బహ్రెయిన్ దేశాలతో సంబంధాల పునరుద్ధరణ కోసం ఇజ్రాయెల్ ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.