ETV Bharat / international

Western Countries Supporting Israel : ఇజ్రాయెల్​కు అండగా పశ్చిమ దేశాలు.. మోదీకి ప్రధాని నెతన్యాహు ఫోన్​కాల్​ - ఇజ్రాయెల్​కు పశ్చిమ దేశాల మద్దతు

Western Countries Supporting Israel : హమాస్ మిలిటెంట్‌ సంస్థతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు బాసటగా పశ్చిమ దేశాలు నిలిచాయి. ఇజ్రాయెల్‌ చేసే అన్ని ప్రయత్నాలకు తాము అండగా ఉంటూ మద్దతు ఇస్తామని అమెరికా సహా యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ ప్రకటించాయి. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆయా దేశాధినేతల భవనాలు, చారిత్రక కట్టడాలపై తెలుపు, నీలం రంగులను ప్రదర్శించారు. మరోవైపు.. హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న యుద్ధ పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్​లో వివరించారు.

Western Countries Supporting Israel
Western Countries Supporting Israel
author img

By PTI

Published : Oct 10, 2023, 3:58 PM IST

Western Countries Supporting Israel : హమాస్ ఉగ్రవాదుల దాడితో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. హమాస్‌ నుంచి రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌ చేసే అన్ని ప్రయత్నాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ దేశాలు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, యూకే ప్రధాని రిషి సునాక్‌ నివాసం సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలపై నీలం, తెలుపు వర్ణాలను ప్రదర్శించాయి.

అమెరికాలో వైట్‌హౌస్‌, న్యూయార్క్‌లోని ది ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అధికారిక నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌, యూకే పార్లమెంట్‌ ది ప్యాలెస్‌ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌, బ్రస్సెల్స్‌లోని ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం, ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ , ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్‌, బెర్లిన్‌లోని ది బ్రాండెన్‌బర్గ్‌ గేట్ తదితర చారిత్రక కట్టడాలపై ఇజ్రాయెల్‌ జెండాను, ఆ దేశ జెండాలోని నీలం, తెలుపు రంగులను ప్రదర్శించారు.

ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదులు పాల్పడిన మారణ హోమాన్ని చూసి యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఎన్నో కుటుంబాలను మిలిటెంట్లు చిదిమేశారని, మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడ్డారని దుయ్యబట్టాయి. హమాస్‌ ఉగ్ర చర్యలను ఎవరూ సమర్థించరని, వాటిని విశ్వమంతా ఖండించాలని పేర్కొన్నాయి. ఇలాంటి అరాచక దాడుల నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు ఇజ్రాయెల్‌ చేపట్టే ప్రతి చర్యకు తాము అండగా ఉంటామని ఈ దేశాలు సంఘీభావం ప్రకటించాయి.

'భారత ప్రజలు ఇజ్రాయెల్ వైపు'
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్​లో మాట్లాడారు. ఈ క్రమంలో హమాస్​తో యుద్ధ పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రధాని.. మోదీకి వివరించారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్​ వైపు నిలబడతారని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా భారత్‌ నిస్సందేహంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. 'హమాస్​ మిలిటెంట్లతో జరుగుతున్న యుద్ధ పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఫోన్ కాల్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.' అని మోదీ ఎక్స్​(ట్విట్టర్​)లో ట్వీట్ చేశారు.

  • I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.

    — Narendra Modi (@narendramodi) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఎయిర్​ఇండియా కీలక నిర్ణయం'
హమాస్‌ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్​ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టెల్‌ అవీవ్‌కు రాకపోకల కోసం బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే వాటిపై ఛార్జీలను ఎత్తివేస్తూ ప్రయాణికులకు కాస్త ఊరట కల్పించింది. "టెల్‌ అవీవ్‌ నుంచి వచ్చేందుకు లేదా అక్కడకు వెళ్లేందుకు బుక్‌ చేసిన టికెట్లను క్యాన్సిల్‌ లేదా రీషెడ్యూల్​ చేసుకుంటే వాటిపై ఛార్జీలను ఒకసారికి రద్దు చేస్తున్నాం. అక్టోబరు 31 వరకు ప్రయాణాల కోసం అక్టోబరు 9వ తేదీకి ముందు బుక్‌ చేసుకున్న టికెట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది" అని ఎయిర్​ఇండియా ఎక్స్(ట్విట్టర్​) వేదికగా వెల్లడించింది.

  • IMPORTANT ANNOUNCEMENT:

    Air India is offering a one-time waiver on charges for rescheduling or cancellation of confirmed tickets on flights to and from Tel Aviv. The offer is valid on tickets issued before 9th October for travel until 31st October 2023.

    Customer Care Contact…

    — Air India (@airindia) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Hamas Militants Dead Bodies : 1,500 మంది ఉగ్రవాదుల హతం.. ఆ ప్రాంతాలపై ఇజ్రాయెల్ పట్టు.. గాజా పార్లమెంటే తర్వాతి టార్గెట్!

Israel vs Palestine War : ఆగని మారణకాండ.. ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో 1,580 మంది మృతి

Iron Dome Israel : ఇజ్రాయెల్​కు 12ఏళ్లుగా 'ఐరన్​ డోమ్' రక్షణ.. లేకుంటే ఊహించని స్థాయిలో నష్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.