ETV Bharat / international

'భారత్​కు విలువ ఇస్తాం.. ఆ విషయంలో మాత్రం ప్రోత్సహించలేం' - అమెరికా పెంటగాన్ ఇండియా రష్యా

US on India Russia: భారత్- రష్యా మధ్య రక్షణ సహకారంపై అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తాము ప్రోత్సహించడం లేదని పేర్కొంది. అదేసమయంలో భారత్​- అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యానికి తాము ఎంతో విలువ ఇస్తున్నట్లు వివరించింది.

అమెరికా పెంటగాన్ ఇండియా రష్
us on india russia relations
author img

By

Published : Apr 23, 2022, 12:13 PM IST

US on India Russia: భారత్‌-రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ తన రక్షణ అవసరాల నిమిత్తం రష్యాపై ఆధారపడడాన్ని అమెరికా ఏమాత్రం పోత్సహించడం లేదని ఆ దేశ రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ అభిప్రాయపడింది.

India Russia defence relationship Pentagon: 2018లో భారత్‌ ఎస్‌-400 గగనతల క్షిపణి వ్యవస్థ కొనుగోలు నిమిత్తం రష్యాతో ఐదు బిలియన్‌ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని అమెరికా అప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. అయినప్పటికీ.. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని భారత్‌ ఈ విషయంలో ముందుకే వెళ్లింది. ఇదే ఎస్‌-400 వ్యవస్థల్ని కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా 'కాట్సా' ఆంక్షల్ని ప్రయోగించింది.

"రక్షణ అవసరాల నిమిత్తం భారత్‌ సహా ఏ దేశమూ రష్యాపై ఆధారపడొద్దు. ఈ విషయంలో మా వైఖరిని నిక్కచ్చిగా, స్పష్టంగా తెలియజేశాం. దీన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. అదే సమయంలో భారత్‌తో ఉన్న మా రక్షణ భాగస్వామ్యానికి విలువిస్తాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. అది మాకు చాలా ముఖ్యం. ప్రాంతీయంగా భారత్‌ ఓ రక్షణ ఛత్రంలా పనిచేస్తోంది. దానికి మేం విలువిస్తున్నాం" అని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వ్యాఖ్యానించారు.

US discourages India reliance on Russia
పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా విషయంలో అమెరికా చాలా తీవ్రంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కఠిన ఆర్థిక ఆంక్షల్ని ప్రయోగించింది. అదే సమయంలో ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. ఇరు దేశాలు శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికింది. కానీ, ఈ భారత వైఖరి పట్ల అమెరికా అసంతృప్తిగా ఉంది. పలుసార్లు భారత్‌-రష్యా బంధంపై భిన్న వ్యాఖ్యలు చేసింది. ఓసారి రష్యాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక బంధాన్ని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. మరోసారి రష్యాతో భారత్‌ బంధాన్ని కొనసాగించడంపై విమర్శలు చేసింది.

ఇదీ చదవండి:

అప్గాన్​ మసీదు, స్కూల్​లో బాంబు పేలుళ్లు- 33 మంది మృతి

మేరియుపొల్‌లో మారణహోమం.. వెలుగులోకి సామూహిక సమాధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.