ETV Bharat / international

'రష్యాకు శిక్ష పడాల్సిందే.. యుద్ధం కోరుకుంటోంది ఆయన ఒక్కరే!'

ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు తప్పకుండా శిక్ష పడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. భద్రతా మండలిలో రష్యాకు ఉన్న వీటో అధికారాన్ని తొలంగించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో రష్యాలో పాక్షిక సైనిక సమీకరణ చేపడతామన్న పుతిన్ ప్రకటనపై.. జెలెన్‌స్కీ మండిపడ్డారు.

ukraine president Volodymyr Zelenskyy
ukraine president Volodymyr Zelenskyy demands punishment for russia
author img

By

Published : Sep 22, 2022, 7:05 PM IST

ఉక్రెయిన్‌పై చేసిన యుద్ధ నేరాలకు తప్పకుండా రష్యాను శిక్షించాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో జెలెన్‌స్కీ వర్చువల్‌గా ప్రసంగించారు. రష్యాలో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్లు పుతిన్‌ ప్రకటించడాన్ని తప్పుపట్టిన జెలెన్‌స్కీ... చేసిన నేరాలకు రష్యా శిక్షను అనుభవించాలని డిమాండ్‌ చేశారు. ఈ యుద్ధంలో మాస్కో చేసిన నేరాలను విచారించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందజేయడం, ప్రపంచ వేదికపై రష్యాను శిక్షించడం వంటి అంశాలతో కూడిన ఓ శాంతి ప్రతిపాదనను ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో రష్యాకు వీటో అధికారాన్ని తొలగించాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు. రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఐకమత్యం ప్రదర్శించాలని కోరారు.

"ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా నేరం జరిగింది. దీనిపై శిక్షకు మేము డిమాండ్ చేస్తున్నాం. మా దేశ సరిహద్దులకు వ్యతిరేకంగా నేరం జరిగింది. మా దేశ ప్రజల ప్రాణాలకు వ్యతిరేకంగా నేరం జరిగింది. మా దేశంలోని మహిళలు, పురుషుల గౌరవానికి వ్యతిరేకంగా నేరం జరిగింది. ఐక్యరాజ్యసమితి విలువలకు వ్యతిరేకంగా నేరం జరిగింది. మా దేశంపైకి దండెత్తిన రష్యాను శిక్షించడానికి ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను మేము రూపొందించాం. ఆ ప్రతిపాదనలను అన్ని దేశాల ముందు ఉంచాం. ఉక్రెయిన్‌ శాంతిని కోరుకుంటోంది. ఐరోపా శాంతిని కోరుకుంటోంది. ప్రపంచం మెుత్తం శాంతిని కోరుకుంటోంది. కానీ మనం యుద్ధాన్ని కోరుకుంటున్న ఒకే ఒక్క వ్యక్తిని చూస్తున్నాం"

--జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న వారిని జెలెన్‌స్కీ తప్పుపట్టారు. ప్రపంచం మెుత్తం శాంతి కోరుకుంటున్నా... అందుకు రష్యా ఏమాత్రం సిద్ధంగా లేదని తెలిపారు. శీతాకాలాన్ని అడ్డంపెట్టుకొని దాడులను తీవ్రం చేయడానికి రష్యా ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. 3 లక్షల మందితో కూడిన పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు పుతిన్‌ ప్రకటించిన కొన్ని గంటలకే... ఐరాసలో జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఈ సమావేశంలో జెలెన్‌స్కీకి సభలోని ప్రతినిధులు నిలబడి కరతాల ధ్వనులు చేశారు.

ఇవీ చదవండి : ప్రపంచ ఆహార భద్రతకు అమెరికా భారీ సాయం.. మళ్లీ చర్చకు వచ్చిన కశ్మీర్ అంశం

'ప్రమాదం అంచున పాక్‌ పసిప్రాణాలు.. అత్తెసరు సాయం మాత్రమే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.