ETV Bharat / international

పాపం ట్రంప్​.. వ్యాపారం సాగక లగ్జరీ హోటల్ విక్రయం - హోటల్​ను విక్రయించిన ట్రంప్​

Trump hotel news: వాషింగ్టన్​లోని లగ్జరీ హోటల్​ను విక్రయించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మయామికి చెందిన సీజీఐ గ్రూప్.. భారీ ధర వెచ్చించి ఈ హోటల్​ను కొనుగోలు చేసింది. రాత్రికి రాత్రే పనులు కూడా మొదలు పెట్టి ట్రంప్​ పేరుతో ఉన్న బోర్డును తొలగించింది.

trump-sells-washington-hotel-to-miami-based-investor-group
భారీ ధరకు లగ్జరీ హోటల్​ను విక్రయించిన ట్రంప్!
author img

By

Published : May 12, 2022, 1:14 PM IST

Trump International Hotel: వాషింగ్టన్​లోని ట్రంప్ ఇంటర్నేషనల్​​ హోటల్​ను ఆయన కుటుంబం విక్రయించింది. మయామికి చెందిన ​ సీజీఐ మర్చంట్ గ్రూప్ దీన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి ట్రంప్ కుటుంబం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ హోటల్ విక్రయంతో వాషింగ్టన్​లో ట్రంప్ కుటుంబం వ్యాపార ఉనికిని కోల్పోనుంది. అయితే ఉత్తర వర్జీనియాలో ఓ గోల్ఫ్​ కోర్టు మాత్రం వారి వద్దే ఉంది.

Trump hotel news: ఈ హోటల్ విక్రయించడం వల్ల ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలే దక్కుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 375 మిలియన్ డాలర్లు చెల్లించి సీజీఐ గ్రూప్..​ ట్రంప్ హోటల్​ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలాన్ని ట్రంప్ కుటుంబం ఫెడరల్ ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. ఏటా అద్దెతో పాటు లాభాల్లో కొంత వాటా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సీజీఐ గ్రూప్​ కూడా ఇప్పుడు ఈ హోటల్​లో కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనుంది. స్థలం మాత్రం వారికి దక్కదు.

Trump news: ట్రంప్​ 2016లో అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు 200 మిలియన్ డాలర్లు వెచ్చించి ఈ హోటల్​ను ఆధునికీకరించారు. ఆయన ఆధికారంలో ఉన్నంతకాలం హోటల్ బాగా నడిచింది. ఆయన మద్దతుదారులు, రిపబ్లికన్లు, విదేశీ లీడర్లు ఈ హోటల్​కే వెళ్లేవారు. అయితే ట్రంప్​ను వివాదాలు చట్టుముట్టడం వల్ల హోటల్​కు తాకిడి తగ్గింది. ఆ తర్వాత ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోవడం, కరోనా ప్రభావం వల్ల హోటల్ వ్యాపారం పడిపోయింది. దీంతో దాన్ని విక్రయించాలని ట్రంప్ కుటుంబసభ్యులు నిర్ణయించారు.

Trump Washington Hotel: మొత్తం 263 గదులున్న ఈ హోటల్​లో ఒక్కో గదికి 1 మిలియన్​ డాలర్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది సీజీఐ గ్రూప్​. 2020లో వాషింగ్టన్​లో ఒక్క హోటల్​ గదికి సగటున 3,54,000 డాలర్ల ధర మాత్రమే పలికేది. కానీ ఇప్పుడు ట్రంప్​ కుటుంబం కుదుర్చుకున్న డీల్ మొత్తం విలువ తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సైతం ఆశ్చర్యపోయారు. హోటల్​ను కొనుగోలు చేసిన రోజే చకచకా పనులు మొదలు పెట్టింది సీజీఐ గ్రూప్​. ద్వారం వద్ద ట్రంప్ పేరుతో ఉన్న బోర్డును రాత్రికిరాత్రే తొలగించింది. ఈ హోటల్​కు కొత్తగా 'వాల్​డార్ఫ్​ అస్టోరియా' పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు.. కఠిన చర్యలకు కిమ్​ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.