ETV Bharat / international

Titan Accident 2023 : డిజైన్‌ లోపాలతోనే టైటాన్‌ ప్రమాదం!.. దర్యాప్తుపై వీడని సస్పెన్స్​ - టైటాన్ ప్రమాదం 2023

Titan Accident 2023 : అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ నౌక శకలాలను వీక్షించేందుకు వెళ్లి టైటాన్‌ మినీ జలాంతర్గామి విచ్ఛిన్నమవడంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదంపై భిన్న విశ్లేషణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయిదుగురి ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదానికి టైటాన్‌ డిజైన్‌ కూడా ఓ కారణమన్న అనుమానాలు ఉన్నాయి. టైటాన్‌ లోపభూయిష్టంగా ఉందని, అది అధిక ఒత్తిడిని తట్టుకోలేక పోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటు టైటాన్‌ను సముద్ర గర్భంలో వదిలేసి వచ్చిన నౌక కెనడా తీరానికి చేరుకుంది.

titan-accident-2023-titan-submarine-accident-enquiry
టైటాన్ ప్రమాదం 2023
author img

By

Published : Jun 25, 2023, 7:30 PM IST

Updated : Jun 25, 2023, 8:57 PM IST

Titan Accident Accident Enquiry : అట్లాంటిక్ మహా సముద్రంలో పేలిపోయిన టైటాన్ మినీ జలాంతర్గామి ప్రమాదానికి గల కారణాలపై అన్వేషణ కొనసాగుతోంది. ఈ మినీ జలాంతర్గామి ప్రమాదానికి డిజైన్‌ కూడా కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. టైటాన్ సబ్‌మెరైన్‌ నిర్మాణ సమయంలోనే లోపాలు ఉన్నట్లు ఓ నిపుణుడు గుర్తించినా.. అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వాదనను మరికొందరు నిపుణులు తెరపైకి తెస్తున్నారు. అధిక ఒత్తిడిని తట్టుకునే శక్తి టైటాన్‌ జలంతర్గామికి ఉందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టైటాన్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, సముద్రంలో లోతుకు వెళ్లినప్పుడు ప్రయాణికులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసినా.. కంపెనీ ముందుకే వెళ్లినట్లు తెలుస్తోంది.

సబ్‌మెర్సిబుల్‌ డిజైన్‌ లోపభూయిష్టంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేశారు. సిబ్బంది, ప్రయాణికులు కూర్చొనేలా జలాంతర్గామి డిజైన్ మార్చారని.. ఇదే ప్రమాదాన్ని కొనితెచ్చిందని విశ్లేషించారు. లోతైన సముద్రంలో భారీ పీడనాన్ని తట్టుకునేలా సబ్‌మెరైన్‌ను తయారు చేయలేదని.. టైటాన్‌ నిర్మాణం, డిజైన్‌ చాలా అసాధారణంగా ఉన్నాయని తెలిపారు. సబ్‌మెర్సిబుల్స్‌లో మానవులు సరిపోయే స్థలం గోళాకారంగా ఉంటుందని.. కానీ టైటాన్ ఆకారం దానికి భిన్నంగా ఉందని వివరించారు. ఇది టైటాన్‌పై ఒత్తిడిని మరింత పెంచి పేలిపోవడానికి కారణమైందని వివరించారు.

టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు సముద్రపు లోతులో ఉన్న ప్రెజర్, ఆక్సిజన్ లేకపోవడం వంటి కారణాల వల్ల తక్షణమే, నొప్పిలేకుండా చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు. మరోవైపు టైటాన్‌ను సముద్ర గర్భంలో వదిలేసి వచ్చిన మదర్‌ షిప్‌ పోలార్ ప్రిన్స్.. న్యూఫౌండ్‌ల్యాండ్‌ ఓడరేవుకు చేరుకుంది. జూన్ 16న న్యూఫౌండ్‌ ల్యాండ్ నుంచి బయలుదేరిన మదర్‌ షిఫ్‌.. టైటాన్‌తో సహా ఐదుగురు వ్యక్తుల బృందాన్ని టైటానిక్‌ నౌక శిధిలాలు ఉన్న దగ్గరికి తీసుకెళ్లింది.

విచ్ఛిన్నమైన టైటాన్‌ మినీ జలాంతర్గామి ఉదంతంపై.. అమెరికా, కెనడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునే పనిలో.. ఇరు దేశాలు నిమగ్నమయ్యాయి. కానీ ఇక్కడే దీన్ని ఎవరు నిగ్గు తేల్చాలనే ప్రశ్న ఎదురవుతోంది. లాంఛనంగా ఇంకా దర్యాప్తు ప్రారంభం కాలేదు. భద్రతా సంస్థలు.. ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపులో నిమగ్నమై ఉండటమే ఇందుకు కారణం. దర్యాప్తు చాలా సంక్లిష్టమని, అందులో అనేక దేశాలు పాలుపంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎవరు నేతృత్వం వహించాలన్నదానిపైనా అస్పష్టత నెలకొంది.

టైటాన్‌ను నిర్వహిస్తున్న ఓషన్‌గేట్‌ కంపెనీ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆ మినీ జలాంతర్గామి బహమాస్‌లో నమోదైంది. టైటాన్‌ను సాగరగర్భంలోకి ప్రవేశపెట్టేందుకు వచ్చిన తోడ్పాటు నౌక పోలార్‌ ప్రిన్స్‌.. కెనడాకు చెందింది. అందువల్ల దర్యాప్తు విషయంలో అయోమయం నెలకొంది. ఈ దుర్ఘటనలో మరణించినవారు బ్రిటన్‌, పాకిస్థాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా దేశస్థులు. అమెరికా కోస్ట్‌గార్డ్‌ ఈ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తుందని జాతీయ రవాణా భద్రతా సంస్థ ప్రకటించింది. తాము కూడా ఇందులో పాలుపంచుకుంటామని పేర్కొంది.

సముద్రగర్భంలో జరిగే దర్యాప్తులు వ్యయప్రయాసలతో కూడుకున్నవని అందుకు చాలా కాలం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ నెలకొన్న కఠోర వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు. సాగరగర్భ శోధనలపై సరైన నియంత్రణలు లేవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీనికన్నా రోదసిలోకి మానవసహిత యాత్రలు నిర్వహించే సంస్థలపైనే పర్యవేక్షణ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ అంశం కూడా దర్యాప్తును ప్రభావితం చేస్తుందని వివరిస్తున్నారు. దర్యాప్తులో టైటాన్‌ డిజైన్‌ కీలకం కానుంది. దీని అసాధారణ ఆకృతి, దానిపై స్వతంత్ర తనిఖీలకు తయారీ సంస్థ నిరాకరించడం వల్లే ప్రమాదం తలెత్తిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

భద్రతాపరమైన నియంత్రణలను అమలు చేసే అంతర్జాతీయ సంస్థల వద్ద టైటాన్‌ నమోదు చేయలేదు. నౌకా నిర్మాణం వంటి అంశాల్లో ప్రమాణాలు నిర్దేశించే సంస్థలు కూడా దీన్ని నిర్దిష్టంగా పరిశీలించలేదు. ఇలాంటి నియంత్రణలు పురోగతికి అడ్డుకట్ట వేస్తాయని.. ప్రమాదానికి లోనైనప్పుడు టైటాన్‌ పైలట్‌గా వ్యవహరిస్తున్న ఓషన్‌గేట్‌ సీఈవో స్టాక్టన్‌ రష్‌ గతంలో పేర్కొన్నారు. టైటాన్‌ ప్రమాదంపై కోర్టుల్లో అనేక దావాలు కూడా దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది కూడా సంక్లిష్టం కానుంది. వాటివల్ల కక్షిదారులకు ఫలితం ఉంటుందా అన్నదానిపై అస్పష్టత ఉంది.

Last Updated : Jun 25, 2023, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.