Srilanka Tamils Boat Ride : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ తమిళులు భారతదేశానికి పారిపోయి వచ్చారు. ఆరుగులు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 19 మంది.. పడవ ప్రయాణం చేసి ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని ధనుష్కోడికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరిని మండపం క్యాంపునకు తరలించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 29 మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తమ దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత దృష్ట్యా అక్కడ అవసరాలు తీర్చుకోలేక.. పడవలో ఇక్కడికి వచ్చినట్లు శ్రీలంక తమిళులు తెలిపారు. 1948లో బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందిన శ్రీలంక.. ఇప్పుడు అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుదీర్ఘ విద్యుత్ కోతలు, గ్యాస్, ఆహారం, ఇతర ప్రాథమిక వస్తువుల కొరతపై గత కొన్ని వారాలుగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. సంక్షోభానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సనే కారణమని ఆరోపిస్తూ.. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'సంక్షోభం నుంచి బయటపడాలంటే.. 300 కోట్ల డాలర్లు కావాలి'