Spain Spyware: స్పెయిన్‌లో స్పైవేర్ కలకలం సృష్టించింది. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉండే పెగసస్ స్పైవేర్ ద్వారా దేశ ప్రధానమంత్రి, రక్షణ మంత్రుల ఫోన్లు గత ఏడాది హ్యాక్ అయినట్లు స్పెయిన్ అధికారులు సోమవారం వెల్లడించారు. 'ప్రధాని మంత్రి పెడ్రో శాంచెజ్ మొబైల్ ఫోన్ 2021, మేలో రెండుసార్లు హ్యాకింగ్‌కు గురైంది. రక్షణ మంత్రి మార్గరిట్ రొబెల్స్ ఫోన్‌ను జూన్‌లో టార్గెట్ చేశారు' అని ప్రెసిడెన్సీ మినిస్టర్ ఫ్లెక్సీ బోలా ఓస్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
" హ్యాకింగ్ ద్వారా చాలా విషయాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నివేదికలను విచారణ నిమిత్తం జాతీయ కోర్టుకు అందించాం. ఇది చట్టవిరుద్ధమైన, అనధికారికంగా చేసిన చర్య అనేదాంట్లో సందేహం లేదు. ఇది విదేశాల నుంచి జరిగినట్లు తెలుస్తోంది. దానికి చట్టబద్ధత లేదు."
- ఫ్లెక్సీ బోలా ఓస్, స్పెయిన్ మంత్రి.
2017 నుంచి 2020 మధ్య ఉత్తర కాటలోనియాలో పదుల సంఖ్యలో ప్రజల ఫోన్లు పెగసస్ బారిన పడినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం తెలిపింది. ఆ విషయంపై వివరాలు వెల్లడించేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: అమెరికా నిఘా సంస్థ తొలి సీటీఓగా భారత సంతతి వ్యక్తి