ETV Bharat / international

లండన్​లో అదృశ్యమైన కారు పాక్​లో ప్రత్యక్షం.. ఎలా గుర్తించారంటే?

రూ.2.30 కోట్లు విలువ చేసే బెెంట్లీ కారును దొంగిలించారు దుండగులు. లండన్​లో దొంగతనానికి గురైన కారు పాకిస్థాన్​లో ప్రత్యక్షమైంది. ఈ కారును ఎలా గుర్తించారంటే?

bently car stolen
బెంట్లీ కారు
author img

By

Published : Sep 4, 2022, 2:21 PM IST

దాదాపు రూ.2.30 కోట్లు విలువ చేసే విలాసవంతమైన బెంట్లీ కారును గుర్తు తెలియని దుండగులు లండన్‌ నుంచి దొంగిలించారు. కట్‌ చేస్తే.. అది పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ఓ సంపన్నుడి ఇంట్లో ప్రత్యక్షమైంది. ఇంతకీ ఎలా గుర్తించారని ఆశ్చర్యపోతున్నారా?

పాకిస్థాన్‌ మీడియా కథనాల ప్రకారం.. కొన్నివారాల క్రితం బెంట్లీ కారు లండన్‌ నుంచి మాయమైంది. చివరకు అది పాకిస్థాన్‌కు అక్రమ మార్గంలో చేరి ఓ సంపన్నుడి చేతిలోకి వెళ్లిపోయింది. కారుని దొంగిలించడంలో ఉపయోగించిన తెలివిని దుండగులు.. దాన్ని ట్రాక్‌ చేసే వ్యవస్థను గుర్తించడంలో మాత్రం విఫలమయ్యారు. బెంట్లీ కారులో ఉండే అత్యాధునిక ట్రాకింగ్‌ వ్యవస్థను ఆఫ్‌ చేయకపోవడంతో లండన్‌లోని నేర విభాగం వాహనం ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించగలిగింది. కరాచీలోని 'కలెక్టరేట్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌'కు సమాచారమిచ్చింది.

లండన్‌ నుంచి వచ్చిన వివరాలతో పాక్‌ అధికారులు కరాచీలో సంపన్నులు నివాసం ఉండే డీహెచ్‌ఏ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఓ ఇంట్లో కారుని గుర్తించారు. అప్పటికే దాన్ని పాకిస్థాన్‌ రిజిస్ట్రేషన్‌ నంబరును కూడా అమర్చారు. తర్వాత అది నకిలీదని తేలింది. ఛాసిస్‌ నంబరు మాత్రం లండన్‌ అధికారులు ఇచ్చిన సంఖ్యతో పోలి ఉండడం గుర్తించారు. పైగా యజమాని సరైన పత్రాలు కూడా చూపించలేకపోవడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కారు కొన్న వ్యక్తితో పాటు.. దాన్ని అమ్మిన మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఓ ఐరోపా దేశానికి చెందిన దౌత్యాధికారి పత్రాలు ఉపయోగించుకొని కారుని పాకిస్థాన్‌కు తరలించినట్లు తర్వాతి విచారణలో తేలడం గమనార్హం. ఈ కారుని అక్రమ మార్గంలో తరలించడం వల్ల దాదాపు 300 మిలియన్ల పాకిస్థాన్‌ రూపాయల పన్నును కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం తతంగం వెనకున్న అసలు సూత్రధారి కోసం గాలింపు ప్రారంభమైంది.

ఇవీ చదవండి: 'భారత్ పెద్ద దేశం.. రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు'

తైవాన్​కు అమెరికా భారీ ప్యాకేజీ.. చైనాకు చెక్ పెట్టేందుకు అధునాతన ఆయుధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.