ETV Bharat / international

షూటింగ్ రేంజ్​లో కాల్పులు.. ముగ్గురు మృతి.. 40గన్స్ చోరీ! - us shooting 2022 gun range

Shooting in US gun range: అమెరికాలో కాల్పులు కలకలరం రేపాయి. ఓ షూటింగ్ రేంజ్​లో చొరబడి దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు 40 తుపాకులు ఎత్తుకెళ్లాడు.

Shooting in US gun range
Shooting in US gun range
author img

By

Published : Apr 10, 2022, 7:58 AM IST

Shooting in US gun range: అమెరికా గ్రాంట్​విల్​లోని ఓ షూటింగ్ రేంజ్​లో కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు చేసిన కాల్పుల్లో గన్ రేంజ్ యజమాని, ఆయన భార్య, మనవడు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి 40 ఆయుధాలను దోచుకెళ్లాడని గ్రాంట్​విల్ పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని చెప్పారు. రాత్రి 8 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. 'లాక్ స్టాక్ అండ్ బ్యారెల్' షూటింగ్ రేంజ్ యజమాని థామస్ హాక్(75) మృతదేహాన్ని గుర్తించారు. అతడి భార్య ఎవెలిన్(75), ల్యూక్(17) శవాలు పక్కనే పడి ఉన్నట్లు తెలిపారు.

Shooting in US gun range
షూటింగ్ రేంజ్

Grantville gun range shooting: 'వేసవి సెలవుల నేపథ్యంలో ల్యూక్ తన తాత ఇంటికి వచ్చాడు. షూటింగ్ రేంజ్​లో తాతకు సహకరించేవాడు. హాక్ కుటుంబం 30 ఏళ్లుగా ఈ షూటింగ్ రేంజ్ నిర్వహిస్తోంది. ఇక్కడ స్థానికంగా వీరికి మంచిపేరు ఉంది. సాయంత్రం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింద'ని పోలీసులు వివరించారు. సాధారణంగా ఆ సమయంలో గన్ రేంజ్ మూసి ఉంటుందని చెప్పారు. హాక్ కుమారుడు రిచర్డ్ ఘటన సమయంలో బయటకు వెళ్లాడని తెలిపారు. మృతదేహాలను అతడే ముందుగా గుర్తించాడని స్పష్టం చేశారు.

అయితే, ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియలేదు. గన్ రేంజ్ నుంచి 40 తుపాకులు గల్లంతైనట్లు గుర్తించారు. సీసీటీవీ కెమెరాలను సైతం దొంగలించారు. భారీగా ఆయుధాలు తీసుకొని పారిపోయిన నేపథ్యంలో పోలీసులు.. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితుల వివరాలు తెలియజేసినవారికి రూ.11.40 లక్షల(15 వేల డాలర్లు) నగదు అందిస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి: 'సంక్షోభం నుంచి బయటపడాలంటే.. 300 కోట్ల డాలర్లు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.