ETV Bharat / international

బ్రిటన్​ రాణికన్నా ఎక్కువ ఖర్చు.. ఘనంగా మాజీ ప్రధాని అంత్యక్రియలు.. మోదీ హాజరు - modi japan visit 2022

జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు మంగళవారం నిర్వహించేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమం కోసం టోక్యో ఒలింపిక్స్​ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. బ్రిటన్​ రాణి అంత్యక్రియలకన్నా ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్న ఈ కార్యక్రమంపై జపాన్ వాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

shinzo abe state funeral controversy
బ్రిటన్​ రాణికన్నా ఎక్కువ ఖర్చు.. ఘనంగా మాజీ ప్రధాని అంత్యక్రియలు.. మోదీ హాజరు
author img

By

Published : Sep 26, 2022, 5:30 PM IST

వందల దేశాల ప్రతినిధులు.. వేల మంది జపాన్ వాసులు.. 18వేల మంది సిబ్బందితో భద్రత.. 11.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ.96 కోట్ల 28 లక్షల 74 వేలు) ఖర్చు.. మంగళవారం జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక అంత్యక్రియల హైలైట్స్​ ఇవి. జులై 8న నారాలో ఎన్నికల ప్రచార సభలో హత్యకు గురైన అబేకు దాదాపు మూడు నెలల తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది జపాన్ ప్రభుత్వం. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుండగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఎప్పుడు? ఎక్కడ ? ఎలా?
జులై 8న షింజే అబే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కుటుంబ సభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు. జపాన్ ప్రభుత్వం మాత్రం సెప్టెంబరు 27(మంగళవారం) అధికారిక లాంఛనాలతో అబేకు తుది వీడ్కోలు పలకనుంది. రాజధాని టోక్యోలో ఈ కార్యక్రమం జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా వందల దేశాల నుంచి మొత్తం 4,300 మంది ప్రతినిధులు, వేల మంది జపనీయులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. టోక్సో ఒలింపిక్స్​ స్థాయిలో ఏకంగా 18వేల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తోంది.

kamala harris in japan
జపాన్ చేరుకున్న కమలా హారిస్
shinzo abe state funeral
అబే అంత్యక్రియల కోసం భద్రతా ఏర్పాట్లు

అంత్యక్రియలపై వివాదం ఎందుకు?
Shinzo Abe state funeral controversy : జపాన్​లో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తి షింజో అబే. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ముమ్మాటికీ సబబు అన్నది ప్రధాని ఫుమియో కిషిద వాదన. అయితే.. ఈ విషయమై జపాన్ వాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇటీవల ఓ సర్వేలో.. ఈ స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించడాన్ని మెజార్టీ ప్రజలు తప్పుబట్టారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు. ఒకటి.. చర్చి. రెండోది.. ఖర్చు.

చర్చికి, అంత్యక్రియలకు ఏంటి సంబంధం?
యూనిఫికేషన్​ చర్చి.. జపాన్​లో ఎప్పటి నుంచో వివాదాస్పదం. ఈ​ చర్చికి, అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్​డీపీ)కి సంబంధం ఉందని షింజో అబే హత్య తర్వాత వెలుగులోకి రావడం విమర్శలకు తావిచ్చింది. చర్చి కారణంగానే తన కుటుంబం తీవ్ర అవస్థలు పడిందని, అందుకే దానితో సంబంధం ఉన్న అబేను చంపానన్నది నిందితుడి వాదన. ఇది జపాన్​వ్యాప్తంగా చర్చనీయాంశంకాగా.. అధికార పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చర్చితో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని ప్రకటించింది. మరోవైపు.. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ఎల్​డీపీలోని అబే వర్గీయుల్ని ప్రసన్నం చేసుకోవచ్చన్నది కిషిద ఆశ అనేది విశ్లేషకుల మాట.

shinzo abe state funeral protest
అబే అంత్యక్రియలకు వ్యతిరేకంగా నిరసన

అంత్యక్రియల ఖర్చు ఎంత?
Shinzo Abe funeral cost : ఇటీవల మరణించిన బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ అంత్యక్రియలకు దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు ఓ అంచనా. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు తుది వీడ్కోలు పలికేందుకు అంతకన్నా ఎక్కువగా.. ఏకంగా రూ.11.8మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.96 కోట్ల 28 లక్షల 74 వేలు, వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది. షింజో అబే విధానాలతో పెరిగిపోయిన ఆర్థిక అసమానతలు తొలగించడం వంటి అర్థవంతమైన పనులకు ఈ డబ్బులు ఉపయోగిస్తే బాగుంటుందన్నది ప్రత్యర్థుల వాదన.

shinzo abe state funeral controversy
అబే అంత్యక్రియలకు వ్యతిరేకంగా నిరసన

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
జపాన్​లో రాజవంశీకులు, సైనిక, రాజకీయ నేతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే.. ఇందుకు సంబంధించిన చట్టాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రద్దు చేశారు. ఆ తర్వాత 1967లో మాత్రమే మాజీ ప్రధాని షిగేరు యోషీదకు అధికారికంగా ఘన వీడ్కోలు పలికారు. జపాన్​పై అమెరికా ఆక్రమణకు తెరదించుతూ శాన్​ఫ్రాన్సిస్కో ఒప్పందం కుదిర్చినందుకు గౌరవంగా ఆ కార్యక్రమం జరిపారు. అయితే.. అది అప్పట్లోనే విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు షింజో అబేకు అలాంటి గౌరవమే ఇవ్వడం వివాదాస్పదమైంది.

shinzo abe state funeral
అబే అంత్యక్రియల కోసం ఏర్పాట్లు

టోక్యోకు మోదీ
మరోవైపు.. అబే అంత్యక్రియల కోసం సోమవారం జపాన్​ వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదతో ద్వైపాక్షిక భేటీ జరపనున్నారు. భారత్​-జపాన్​ బంధం బలోపేతం కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై సమీక్షించనున్నారు. క్వాడ్​ కూటమిలోని ఇతర దేశాల అధినేతలు కూడా టోక్యో వచ్చినా.. వారితో భేటీలేవీ ఖరారు కాలేదని విదేశాంగ శాఖ తెలిపింది.

జపాన్‌.. భారత్‌కు మిత్రదేశం. అబే అధికారంలో ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి. 2018లో మోదీ జపాన్‌కు వెళ్లినప్పుడు.. అబే మన ప్రధానిని తన పూర్వీకుల నివాసానికి తీసుకెళ్లారు. ఈ ఆహ్వానం ఇద్దరి నేతల మధ్య ఉన్న ఆత్మీయబంధాన్ని చాటింది. అలాగే క్వాడ్ సదస్సులో భాగంగా ఈ ఏడాది మేలో మోదీ మరోసారి ఆ దేశంలో పర్యటించారు. ఆ సందర్భంగా అబేను కలుసుకున్నారు. అప్పటికే అబే ప్రధాని పీఠం దిగి రెండు సంవత్సరాలయింది. అబే హత్య నేపథ్యంలో జులై 9న భారత్ సంతాప దినంగా పాటించింది.

modi tweets on shinzo abe
జపాన్ పర్యటనపై మోదీ ట్వీట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.