Venezuela Landslide: వెనెజువెలాలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుకు ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో 52 మంది గల్లంతయ్యారు.
ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో నిర్వాసితులైన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
డ్రోన్‌లతో మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సివిల్ ప్రొటెక్షన్ వైస్ మినిస్టర్ కార్లోస్ పెరెజ్ అంప్యూడా చెప్పారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా కుండపోత వర్షాల కారణంగా వెనెజువెలాలో 23 రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి
ఇవీ చదవండి: పెను విషాదం.. పడవ ప్రమాదంలో 76 మంది మృతి
అర్ధరాత్రి రష్యా మెరుపు దాడి.. 17 మంది మృతి.. అనేక ఇళ్లు ధ్వంసం