ETV Bharat / international

దారుణం.. ఆస్పత్రిలో షార్ట్​ సర్క్యూట్.. 11 మంది చిన్నారులు మృతి - undefined

ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మరణించారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్​లోని టివయూనే పట్టణంలో జరిగిందీ ఘటన.

senegal hospital fire
దారుణం.. ఆస్పత్రిలో షార్ట్​ సర్క్యూట్.. 11 మంది చిన్నారులు మృతి
author img

By

Published : May 26, 2022, 3:12 PM IST

Senegal hospital fire: ఆస్పత్రిలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల వార్డులో మంటలు చెలరేగి వీరంతా మరణించారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. ఆఫ్రికన్ దేశమైన సెనెగల్​లోని టివయూనే పట్టణంలో బుధవారం జరిగిందీ ఘటన.

ప్రమాదం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆ దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సదస్సు కోసం జెనీవా వెళ్లి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దులాయే డియూఫ్ సర్.. తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని, స్వదేశానికి పయనమయ్యారు.
సెనెగల్​లో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. లింగూరీలో ఏడాది క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు నవజాత శిశువులు మరణించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.