ETV Bharat / international

ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడి- 23 మంది బలి

ఉక్రెయిన్​లోని జపొర్జియా నగరంపై రష్యా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 23 మంది మరణించగా, మరో 28 మంది గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Russian strike on the city of Zaporizhzhia

author img

By

Published : Sep 30, 2022, 12:52 PM IST

Updated : Sep 30, 2022, 1:54 PM IST

Zaporizhzhia attacked : ఉక్రెయిన్​లోని జపొర్జియా నగరంపై రష్యా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 23 మంది మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని జపొర్జియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రష్యా ఆక్రమిత భూభాగానికి వెళ్తున్న మానవత కాన్వాయ్‌ను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాయని ఆయన అన్నారు. దాడిలో ధ్వంసమైన వాహనాలు, రోడ్డుపై పడి ఉన్న మృతదేహాల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

రష్యా ఆక్రమిత భూభాగం నుంచి తమ బంధువులను తీసుకువచ్చేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని స్టారుఖ్​ తెలిపారు. రష్యాలో నాలుగు ప్రాంతాలను విలీనం చేయడానికి మాస్కో సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే విలీన అంశంపై రష్యా రిఫరెండం నిర్వహించింది.

ఇదీ చదవండి: కాబుల్​లో ఆత్మాహుతి దాడి.. 19 మంది మృతి.. 27 మందికి గాయాలు

చైనాలో తెగిపడుతున్న పెద్ద తలలు.. అవినీతిపరులపై కమ్యూనిస్ట్​ పార్టీ వేటు!

Last Updated : Sep 30, 2022, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.