ఉక్రెయిన్‌పై మరోమారు రష్యా భీకర దాడులకు పాల్పడింది. ఖర్కివ్‌లో పౌరులను తరలిస్తున్న ఓ కాన్వాయ్‌పై షెల్స్‌తో రష్యా బలగాలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిని ఖర్కివ్ గవర్నర్ ఒలేహ్ సినీహుబోవ్ ఖండించారు. ఇది సమర్థించలేని చర్య అని పేర్కొన్నారు.
అలాగే సెప్టెంబరు 30న కూడా ఉక్రెయిన్‌లోని జపొర్జియా నగరంపై రష్యా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 23 మంది మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని జపొర్జియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రష్యా ఆక్రమిత భూభాగానికి వెళ్తున్న మానవత కాన్వాయ్‌ను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాయని ఆయన అన్నారు. దాడిలో ధ్వంసమైన వాహనాలు, రోడ్డుపై పడి ఉన్న మృతదేహాల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి: న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా... అణు కేంద్రానికి ముప్పు!