ETV Bharat / international

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌ - ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్​ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్​ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది విదేశాంగ శాఖ.

ruchira-kamboj
రుచిరా కాంబోజ్‌
author img

By

Published : Jun 22, 2022, 5:30 AM IST

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్‌ను నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్లు పేర్కొంది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన రుచితా ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. భూటాన్‌కు భారత మొదటి మహిళా రాయబారిగా రుచిరా నిలిచారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టి.ఎస్‌.తిరుమూర్తి స్థానాన్ని కాంబోజ్‌ భర్తీ చేయనున్నారు.

రుచితా కాంబోజ్‌ 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. అంతేకాదు, 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో టాపర్ కూడా. 2002-2005 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గా ఆమె నియామకం పొందారు. అక్కడ ఐరాస శాంతి పరిరక్షణ, యూఎన్‌ భద్రతా మండలి సంస్కరణ, మధ్యప్రాచ్య సంక్షోభం తదితర అంశాలపై పనిచేశారు. అనంతరం పలు పదవుల్లో సేవలందించిన ఆమె.. ఇకపై ఐక్యరాజ్య సమితిలో భారత్‌ గళాన్ని వినిపించనున్నారు.

ఇప్పటివరకు ఈ విధులు నిర్వహించిన తిరుమూర్తి ఐరాసలో భారత గళాన్ని స్పష్టంగా వినిపించారు. రష్యాపై ఉక్రెయిన్‌ దాడుల నేపథ్యంలో.. భారత్‌ వైఖరిని పలు దేశాలు తప్పుబట్టగా, ఆయా దేశాలకు ధీటుగా బదులిచ్చారు. ఉక్రెయిన్‌ విషయంలో తామేం చేస్తున్నామో తమకు తెలుసని, తమకు ఎవరూ సలహాల ఇవ్వాల్సిన అవసరం లేదని డచ్‌ రాయబారికి గట్టిగా సమాధానమిచ్చారు. ఐరాస విధానాలు, అంతర్జాతీయ చట్టాలను తాము పాటిస్తామని, అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవమిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

నోబెల్ శాంతి బహుమతికి 103 మిలియన్​ డాలర్లు.. నగదు మొత్తం వారికే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.