ETV Bharat / international

పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ.. 48 మంది మృతి - william ruto condolences to kenya road accidents

పశ్చిమ కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 48 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.

కెన్యా రోడ్డు ప్రమాదం
Kenya road accident
author img

By

Published : Jul 1, 2023, 6:28 AM IST

Updated : Jul 1, 2023, 7:28 AM IST

Kenya Road Accident : పశ్చిమ కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 48 మందిని బలితీసుకుంది. రోడ్డుపై నడుస్తున్న పాదచారులపై ఓ లారీ దూసుకెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 48 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత విభాగాల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..
Kenya Road Accident Death Toll : శుక్రవారం సాయంత్రం లోండియానిలోని రిఫ్ట్ వ్యాలీ.. కెరిచో-నకురు మధ్య ఉన్న హైవేపై కెరీచో వైపునకు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి.. అక్కడే ఉన్న చిరు వ్యాపారులతో పాటు బస్​ స్టాండ్​లో వేచి ఉన్న స్థానికుల పైకి దూసుకెళ్లింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. రోడ్డుపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయని అధికారులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడ్డ వారిని పోలీసులు చికిత్స కోసం స్థానికంగా ఉన్న వివిధ ఆస్పత్రులకు తరలించారు. ధ్వంసమైన వాహన శకలాల కింద ఇంకొంత మంది చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. జోరు వర్షం పడుతూ ఉండడం సహా ఆ ప్రాంతమంతా చీకటిగా ఉన్నందున మృతుల సంఖ్యను ఇప్పట్లో నిర్ధరించలేమని.. దానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పారు. వర్షం వల్ల సహాయక చర్యల్లో అంతరాయం కలిగిందని అన్నారు. ఇక రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

  • The country mourns with the families who have lost loved ones in a horrific road accident in Londiani, Kericho County. It is distressing that some of the fatalities are young people with a promising future and business people who were on their daily chores.

    We pray for the…

    — William Samoei Ruto, PhD (@WilliamsRuto) June 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Statement on the Londiani crash

    A fatal road traffic crash occurred this evening at the Londiani Junction, in the Nakuru -Kisumu highway .

    Rescue efforts are underway involving officers from various agencies of national and county governments, elected leaders, the Redcross…

    — KIPCHUMBA MURKOMEN, E.G.H (@kipmurkomen) June 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాదచారులపైకి లారీ దూసుకెళ్లి, అనేక మంది మరణించిన ఘటనపై స్పందించారు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవాణా మంత్రి కిప్‌చుంబా ముర్కోమెన్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర ఆవేదనన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు చేపడతామని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Last Updated : Jul 1, 2023, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.