Prague University Shooting : చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. జన్ పలాచ్ స్క్వేర్లోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించారు. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 15మంది మరణించగా, మరో 20మందికి గాయాలయ్యాయి. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దుండగుడిని ముట్టబెట్టారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల జరిగిన భవనంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహించారు. దుండగుడు అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిగా అధికారులు గుర్తించారు. కాల్పుల ఘటన వెనుక ఏ తీవ్రవాద సంఘాలు లేవని చెక్ అంతర్గత శాఖ మంత్రి విట్ రాకుసన్ స్పష్టం చేశారు. విచారణలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
సంతాపం తెలిపిన కేంద్ర విదేశాంగ మంత్రి
మరోవైపు ప్రాగ్లోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ' కాల్పుల విషయం తెలిసి చాలా బాధపడ్డాను. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
క్రిస్మస్ పార్టీలో కాల్పులు
కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఘటనే మెక్సికోలో జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో జరిగిన క్రిస్మస్ పార్టీలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 'పొసాడా' అనే పార్టీ అనంతరం హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని వెల్లడించారు. అయితే ఆ కాల్పులకు దారితీసిన పరిస్థితులను తెలపలేదు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
సౌండ్ చేయొద్దు అన్నందుకు పక్కింటి వారిపై కాల్పులు
శబ్దం చెయ్యొద్దు అన్నందుకు పక్కింట్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటన అమెరికాలో కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెరట్లో కాల్పులు శబ్దం చేస్తున్న నిందితుడిని ఆపమన్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులు చేస్తుంటే ఎలా నిద్రపోవాలి అన్న పాపానికి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాడు. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
మాల్లోకి చొరబడి కాల్పులు.. 8 మంది మృతి.. నిందితుడు హతం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి.. స్కూల్లో ఫైరింగ్లో ఇద్దరు విద్యార్థులు