Plane Crash In Brazil Amazon : బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు,. ఇంకా పసికందుతో సహా 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సింగిల్ ఇంజిన్ సెస్నా కారవాన్ అనే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రియో బ్రాంకోలోని విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిందని ఎకర్ అనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విమానం కుప్పకూలిన చోట పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కార్చిచ్చుగా మారినట్లు పేర్కొంది.
Brazil Plane Crash : అమెజాన్ అడవుల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. గతనెలలో బ్రెజిల్‌లోని అమెజాన్ అడవిలో విమానం కుప్పకూలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఉత్తర అమెజాన్‌లోని బార్సిలోస్ ప్రావిన్స్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి గురైన ఎంబ్రేయర్ PT-SOG విమానం మనౌస్ నుంచి బయలుదేరిందని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు. 12 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్ల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు విల్సన్ లిమా.
Malaysia Plane Crash : కొన్నాళ్ల క్రితం చార్టర్ విమానం అదుపుతప్పి కూలిన ఘటనలో 10 మంది మరణించారు. ఈ ఘటన మలేసియా రాజధాని కౌలాలంపుర్‌కు ఉత్తరాన ఉన్న హైవేపై జరిగింది. లంకావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎక్స్‌ప్రెస్ వేపై కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది మృతి చెందారని అధికారులు చెప్పారు. ఈ విమానం ఎక్స్‌ప్రెస్ వేపై కూలడం వల్ల కారుతో పాటు బైక్‌ను ఢీ కొట్టిందని.. దీంతో మరో ఇద్దరు మరణించారని తెలిపారు. సిగ్నల్ ఇచ్చిన మూడు నిమిషాలకే విమానం రహదారిపై కూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు విమానం బ్లాక్ బాక్స్‌ను వెతుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Egypt Car Accident : హైవేపై అనేక కార్లు ఢీ.. 32 మంది మృతి.. వాహనాలకు మంటలు
Israel Ground Invasion Gaza : గాజాపై ఇజ్రాయెల్ రెండోదశ యుద్ధం.. కాల్పుల విరమణకు నో